ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- July 18, 2026
కువైట్ సిటీ: ఫహాహీల్ ప్రాంతంలోని బలాత్ అల్-షుహదా స్ట్రీట్ మరియు షేక్ సలేం సభా అల్-సబాహ్ స్ట్రీట్ (కోస్టల్ రోడ్) ఇంటర్ సెక్షన్ ను అన్ని దిశల్లో వారం రోజుల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్లు కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.
ట్రాఫిక్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, మూసివేత సమయంలో మెరైన్ క్లబ్ ఇంటర్ సెక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలను బలాత్ అల్-షుహదా స్ట్రీట్ వైపు మళ్లిస్తారు. దీంతో ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ తన అధికారిక ఎక్స్ (X) అకౌంట్లో ఈ మేరకు ప్రకటించింది. వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ట్రాఫిక్ మళ్లింపులను పాటించాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







