స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- July 18, 2026
హైదరాబాద్: భారత్ ప్రయోగించిన తొలి ప్రైవేటు రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో భారతీయ అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ఇవాళ శ్రీహరికోట నుంచి విక్రమ్1 రాకెట్‌ను నింగిలోకి పంపింది. 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూ కక్ష్యలోకి ఆ రాకెట్ విజయవంతంగా తన పేలోడ్స్‌ను తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ తన ఎక్స్ అకౌంట్లో రియాక్ట్ అయ్యింది. హల్లో స్పేస్.. మేం వచ్చేశాం అంటూ ట్వీట్ చేసింది. విక్రమ్1 పరీక్ష విజయవంతమైనట్లు తన పోస్టులో ఆ కంపెనీ వెల్లడించింది. భారతదేశం ప్రయోగించిన తొలి ప్రైవేటు రాకెట్ విజయవంతంగా తన మిషన్ పూర్తి చేసినట్లు ఆ ట్వీట్లో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నింగిలోకి ప్రైవేటు రాకెట్ పంపే సామర్థ్యం ఉన్న మూడవ దేశంగా ఇండియా నిలిచినట్లు స్కైరూట్ సంస్థ తన పోస్టులో పేర్కొన్నది. చరిత్ర సృష్టించినట్లు చెప్పింది.
విక్రమ్1 రాకెట్ పేలోడ్‌తో పాటు బెస్ట్ విషెస్ చెబుతూ ప్రధానితో పాటు అనేక మంది రాసిన లేఖలను కూడా నింగిలోకి మోసుకెళ్లింది. మిషన్ ఆగమన్ పేరుతో ఈ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టారు. భారతీయ అంతరిక్ష రంగంలో ఇక ప్రైవేటు ప్రస్థానం కూడా ఇక ప్రయోగంతో మొదలైంది. శ్రీహరికోటలోని ఫస్ట్ ల్యాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ 12.05 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. వాస్తవానికి 11.30 నిమిషాలకే ఎగరాల్సిన ఆ రాకెట్లో నావిగేషన్ లోపాలు తలెత్తడంతో ప్రయోగాన్ని రీషెడ్యూల్ చేశారు. విక్రమ్1 రాకెట్లో గ్రహ స్పేస్, కాస్మోసర్వ్, డీక్యూబ్డ్, స్కైరూట్ స్కోప్ పేలోడ్స్ ఉన్నాయి. 18 క్యారెట్ల గోల్డ్ రాకెట్ బొమ్మతో పాటు ప్రధాని మోదీ రాసిన వందేమాతరం సందేశ పోస్టు కార్డు కూడా పేలోడ్స్‌లో ఉన్నాయి. ఇంజినీర్లు, సైంటిస్టులు, ఆస్ట్రోనాట్స్ చెప్పిన విషెస్ లేఖలు కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!







