టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీ నందు
- July 19, 2026
టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, హీరో శ్రీ నందు. ప్రస్తుతం ఆయన నటించిన సరికొత్త చిత్రం 'అగ్లీ స్టోరీ' ఓటీటీలో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇటీవల హాట్ స్టార్ లో విడుదలైన అగ్లీ స్టోరీ, దురంధర్, ది రాజా సాబ్ సినిమాల తర్వాత అత్యధిక ఆదరణ పొందిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
శ్రీ నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ ఏకంగా 8.1 మిలియన్ వ్యూస్ సాధించి టాప్‌లో నిలిచింది. తాజాగా హాట్ స్టార్ విడుదల చేసిన టాప్ 10 అత్యధిక వ్యూస్ చిత్రాల లిస్ట్ లో అగ్లీ స్టోరీ 3 వ స్థానంలో నిలిచింది. ఈ సందర్బంగా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మూవీ యూనిట్ ధన్యవాదములు తెలిపింది.
కథాబలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన నటనతో మెప్పిస్తున్న శ్రీ నందుకు ఈ సినిమా విజయం ఆయన కెరీర్‌కు మరింత బూస్ట్‌ని ఇస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో శ్రీ నందు నటన చాలా అద్భుతం అని విశ్లేషకులు కొనియాడారు. చాలా సెటిల్ గా నటించడంతో పాటు, తన పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాతో శ్రీ నందు నటనా సమర్థ్యం ఎలాంటిదో స్పష్టంగా అర్ధం అవుతుంది. ఆయనకు సరైన పాత్ర పడితే వెండితెరపై చరిత్ర సృష్టించగలడు అని సినిమా విమర్శకులు సైతం ప్రశంశిస్తున్నారు.
శ్రీ నందుకు ఉన్న మరో అడ్వాంటేజ్ అతని పొడువు. ఆ ఒడ్డుపొడుగు కు సరైన పాత్ర పడితే అందరిని మైమరిపించగలడు అనిపిస్తుంది. రొమాంటిక్ పాత్ర అయినా, మాస్ పాత్ర అయినా ఎలాంటి పాత్ర అయినా ఒదిగిపోయే నటనా కౌశల్యం ఆయన సొంతం అనిపిస్తుంది. ప్రేక్షకులను రంజింప చేయడానికి ఎలాంటి రోల్ అయినా చేసే నటులు చాలా అరుదు. అందులో శ్రీ నందు ఒకరు. కష్టపడే తత్వం కలవాడు కాబట్టే ఇన్ని సంత్సరాలు ప్రేక్షకులకు దగ్గరగా ఉన్నాడు.
ఇప్పుడు అదృష్టం కలిసొచ్చి ప్రతిభకు తగ్గ పత్రాలు పడుతున్నాయి. అవి వెండితెరపై పండుతున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఆయనకు విపరీతమైన ఆదరణ దక్కుతుంది. దీంతో శ్రీ నందు రాబోయే సినిమాలపై ప్రేక్షకులకు భారీ అంచనాలు కూడా పెరుగుతున్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి ఎలాంటి సినిమాలతో రాబోతున్నారో ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







