అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- July 19, 2026
అబుదాబి: పదేపదే ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో అబుదాబిలోని 'యమ్మీ ఇండియన్ బైట్' (Yummy Indian Bite) రెస్టారెంట్‌ను తాత్కాలికంగా మూసివేయాలని అబుదాబి ఆహార భద్రతా అథారిటీ (ADAFSA) ఆదేశించింది. ఆహార నియంత్రణ తనిఖీ నివేదికలో పదేపదే ఆహార భద్రతా ఉల్లంఘనలు నమోదయ్యాయని, గతంలో పలుమార్లు హెచ్చరించి సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా యాజమాన్యం సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని ADAFSA తెలిపింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే పరిపాలనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడటంతో రెస్టారెంట్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే, అన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దుకుని, నిర్దేశిత ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తూ అధికారుల అనుమతి పొందిన తర్వాతే రెస్టారెంట్‌ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఎమిరేట్‌లోని అన్ని ఆహార విక్రయ కేంద్రాలు కఠినమైన ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.ఆహార నాణ్యత లేదా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటే అబుదాబి ప్రభుత్వ టోల్‌ఫ్రీ నంబర్ 800555కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ADAFSA విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!







