సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- July 19, 2026
రియాద్: సౌదీ అరేబియాలో రెసిడెన్సీ, లేబర్, సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించిన 15,836 మందిని గత వారం దేశవ్యాప్తంగా నిర్వహించిన సంయుక్త తనిఖీల సందర్భంగా అధికారులు అరెస్టు చేశారు. వీరిలో 7,892 మంది రెసిడెన్సీ , 4,617 మంది సరిహద్దు భద్రతా , 3,327 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అదేవిధంగా, అక్రమంగా సౌదీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 1,631 మందిని కూడా అరెస్టు చేశారు. వీరిలో 65 శాతం ఇథియోపియా, 33 శాతం యెమెన్ పౌరులు కాగా, మిగిలిన 2 శాతం ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు.
అక్రమంగా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన 42 మందిని అదుపులోకి తీసుకోగా, అక్రమ వలసదారులకు రవాణా, ఆశ్రయం, ఉపాధి కల్పించడం లేదా వారిని దాచిపెట్టిన 21 మందిపై కూడా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం 30,139 మంది (28,087 మంది పురుషులు, 2,052 మంది మహిళలు)పై చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 17,273 మందిని ప్రయాణ పత్రాల కోసం, 6,160 మందిని ప్రయాణ బుకింగ్‌ల కోసం సంబంధిత అధికారులకు పంపించగా, 12,211 మందిని దేశం నుంచి బహిష్కరించినట్లు వెల్లడించింది.
అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారికి సహకరించడం, రవాణా, ఆశ్రయం లేదా ఉపాధి కల్పించడం వంటి చర్యలకు పాల్పడిన వారికి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష, SR1 మిలియన్ (10 లక్షల సౌదీ రియాల్స్) వరకు జరిమానా, అలాగే నేరానికి ఉపయోగించిన వాహనాలు, ఆస్తులను స్వాధీనం చేసుకునే శిక్షలు విధించవచ్చని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లలో 911, ఇతర ప్రాంతాల్లో 999 లేదా 996 నంబర్లకు సమాచారం అందించాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, వారికి ఎలాంటి చట్టపరమైన బాధ్యత ఉండదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!







