ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- July 19, 2026
దోహా: వేసవి వేడిని తట్టుకుని కూడా వాకింగ్, జాగింగ్, వ్యాయామం చేసేందుకు ఖతార్‌లోని ఎయిర్‌కండీషన్డ్ పార్కులు ప్రజలకు ప్రధాన ఆకర్షణగా మారాయి. అత్యాధునిక ఎయిర్‌కండీషన్డ్ వ్యవస్థలతో రూపొందించిన ఈ పార్కుల్లోని ట్రాక్‌లు వేసవి కాలంలో కూడా ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతను కొనసాగిస్తుండటంతో నివాసితులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో వీటిని వినియోగిస్తున్నారు.
ఈ పార్కుల్లోని వాకింగ్, రన్నింగ్ ట్రాక్‌లు సుస్థిరత ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఆధునిక కూలింగ్ సిస్టమ్‌లతో పనిచేస్తున్నాయి. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజుల్లో కూడా ప్రజలు తమ ఫిట్‌నెస్ కార్యక్రమాలను అంతరాయం లేకుండా కొనసాగించగలుగుతున్నారు.
ఖతార్‌లోని రౌదత్ అల్ హమామా పార్క్ దేశంలోనే అత్యంత పొడవైన సుమారు 1.2 కిలోమీటర్ల ఎయిర్‌కండీషన్డ్ ట్రాక్ ను కలిగి ఉంది. అల్ ఘరాఫా పార్క్ లో 657 మీటర్ల ఎయిర్‌కండీషన్డ్ ట్రాక్ ఉండగా, ఉమ్ అల్ సెనీమ్ పార్క్ లో సుమారు 1.143 కిలోమీటర్ల ఎయిర్‌కండీషన్డ్ ట్రాక్ అందుబాటులో ఉంది. ఆక్సిజన్ పార్క్ లో కూడా చల్లని వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేశారు.
అలాగే తాగునీటి సౌకర్యం, ప్రార్థనా స్థలాలు, వుజూ సదుపాయం, అవుట్‌డోర్ జిమ్ పరికరాలు, సేవా కేంద్రాలు వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, నీడనిచ్చే విశ్రాంతి ప్రాంతాలు, చిన్నారుల ఆట స్థలాలు, సైక్లింగ్ ట్రాక్‌లు, సేవా కియోస్క్‌లతో ఈ పార్కులు కుటుంబాలు, క్రీడాకారులు, ఫిట్‌నెస్ ప్రియులకు వేసవిలోనూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. దీంతో ఖతార్‌లోని ఎయిర్‌కండీషన్డ్ పార్కులు వేసవి కాలంలో ప్రజలకు ప్రముఖ విహార, ఆరోగ్య కేంద్రాలుగా నిలుస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







