అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- July 19, 2026
అమ్మాన్: జోర్డాన్‌లోని కింగ్ హుస్సేన్ అంతర్జాతీయ విమానాశ్రయం (అకాబా) మరియు అకాబా పోర్టు సాధారణంగానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని, వాటిని ఖాళీ చేయాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని జోర్డాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి, ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రి మహ్మద్ మొమాని స్పష్టం చేశారు.
జోర్డాన్ అధికారిక వార్తా సంస్థ పెట్రా (Petra) వెల్లడించిన వివరాల ప్రకారం, ఆదివారం మీడియాతో మాట్లాడిన మొమాని, గత కొన్ని గంటలుగా జోర్డాన్ భద్రతా సంస్థలు ఎలాంటి సంభావ్య ముప్పును గుర్తించలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రజలను హెచ్చరించేంత ప్రమాదకర పరిస్థితి ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు.
కింగ్ హుస్సేన్ అంతర్జాతీయ విమానాశ్రయం, అకాబా పోర్టులో అన్ని కార్యకలాపాలు సాధారణ విధానంలోనే కొనసాగుతున్నాయని చెప్పారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు అమల్లో ఉన్నాయని, ఎలాంటి ముప్పు తలెత్తినా వెంటనే హెచ్చరిక సైరన్లు మోగించే విధానాన్ని సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.
ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని జోర్డాన్ ప్రభుత్వం సూచించింది. దేశ భద్రతా పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, అవసరమైతే తక్షణ చర్యలు తీసుకునేందుకు అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌కు జైలు, కారును ధ్వంసం చేసిన కువైట్ అధికారులు
- అబుదాబిలో షఖ్‌బౌట్ బిన్ సుల్తాన్ వీధిలో మూడు రోజుల పాటు పాక్షిక రహదారి మూసివేత
- అంతర్జాతీయ బాండ్ల జారీతో కువైట్‌కు 3.25 బిలియన్ డాలర్లు
- షార్జాలో పోగొట్టుకున్న, యజమానులు క్లెయిమ్ చేయని వస్తువుల నిర్వహణపై కొత్త చట్టం
- సౌదీ అరేబియాలో 5 డ్రోన్లను అడ్డుకున్న సంకీర్ణ దళాలు..
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్‌లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్‌లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం







