అమెరికాలో ఇద్దరు ముస్లిం మత గురువుల కాల్చివేత
- August 14, 2016
పట్టపగలు నడిరోడ్డుపై ఇద్దరు ముస్లిం మత గురువుల కాల్చివేత ఘటన అమెరికాలో కలకలం రేపింది. న్యూయార్క్ నగరం తూర్పు ప్రాంతమైన క్వీన్స్ లో శనివారం మధ్యాహ్నం(లోకల్ టైమ్) ఈ దురాగతం చోటుచేసుకుంది. అక్కడి ఓజోన్ పార్క్ సమీపంలో గల అల్ ఫుర్ఖాన్ జమే మసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు ముగించికుని ఇంటికి వెళుతోన్న ఇమాం మౌలామా అకోంజీ(55), అతని సహాయకుడు తరాఉద్దీన్(64)లను గుర్తుతెలియని దుండగుడు కాల్చి చంపాడు. బుల్లెట్లు నేరుగా తలలోకి దూసుకెళ్లడంతో అకోంజి హత్యాప్రదేశంలోనే చనిపోగా, తారాఉద్దీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.కాల్పులు జరిగిన సమయంలో మృతులు ఇద్దరూ ఇస్లాం సంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారని, ఇది మతవిద్వేష హత్య అవునో కాదో ఇప్పుడే చెప్పలేమని న్యూయార్క్ పోలీసులు అంటున్నారు. పరారీలో ఉన్న దుండగుడికోసం వేటాడుతున్నామని చెప్పారు. అల్ ఫుర్ఖాన్ మసీదు ఇమాం మౌలామా అంకోజీ స్వదేశం బంగ్లాదేశ్ అని, రెండేళ్ల కిందటే ఆయన న్యూయార్క్ వచ్చాడని పోలీసులు పేర్కొన్నారు. మత గురువు, అతని సహాయకుడి హత్యతో క్వీన్స్ ప్రాంతంలోని ముస్లింలు ఉలిక్కిపడ్డారు. పదుల సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. న్యాయం కావాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అమెరికన్లలో ఇస్లామోఫోబియా(ముస్లింల పట్ల భయం) పెరిగిపోయేలా రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ప్రచారం చేస్తున్నారని, ఆయన విద్వేష వ్యాఖ్యల వల్లే ఇలాంటి హత్యలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళకారులు ఆరోపించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







