దర్శకుడు హను రాఘవపూడి వివాహం ఈ నెల 26న..
- August 14, 2016
యువ దర్శకుడు హను రాఘవపూడి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అమూల్యతో ఈ డైరెక్టర్ వివాహం ఈ నెల 26న జరగనుంది. ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్న అమూల్యతో హను నిశ్చితార్థం గత మే నెలలో జరిగింది. ఆగస్టు 26న సిటీలోని ఫైవ్ స్టార్ హోటల్లో జరిగే ఈ వెడ్డింగ్‌కి పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.'అందాల రాక్షసి', 'క్రిష్ణగాడి వీర ప్రేమగాధ' లాంటి సినిమాలు చేసి దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న హను రాఘవపూడి.. ప్రస్తుతం నితిన్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. అది పూర్తి కాగానే అఖిల్‌తో చేపట్టే ప్రాజెక్టుతో బిజీ అవుతాడట. ఈ మధ్యే మరో డైరెక్టర్ క్రిష్ కూడా డాక్టర్ అయిన రమ్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







