రేపు విడుదల కానున్న 'ఇంకొక్కడు' ఆడియో
- August 14, 2016
శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్. ఆయన తాజాగా నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ `ఇంకొక్కడు`. నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం `ఇరుముగన్`. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ పై ఆ సంస్థ అధినేత నీలం కృష్ణారెడ్డి `ఇంకొక్కడు` అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఆగస్ట్ 15న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ "చియాన్ విక్రమ్ హీరోగా, గ్లామర్ క్వీన్స్ నయనతార, నిత్యామీనన్‌లు నటించిన చిత్రం ఇంకొక్కడు. శిబుథమీన్స్ గారు, ఆనంద్ శంకర్ గారు కాంబినేషన్ లో భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం రూపొందుతోంది. స్టార్ నటీనటులతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గా హరీష్ జైరాజ్, సినిమాటోగ్రాఫర్ గా ఆర్.రాజశేఖర్, ఎడిటర్ గా భువన్ శ్రీనివాస్ వంటి టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇటీవల తమిళంలో విడుదలైన థియేట్రికల్ ట్రైలర్, పాటలకు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది. ప్రతి సినిమాలో ఏదో ఒక విలక్షణతను చూపే చియాన్ విక్రమ్ గారు ఈ చిత్రంలో హీరోగానే కాకుండా, హిజ్రా గెటప్‌లో కూడా అలరిస్తున్నారు. సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మేకింగ్ వాల్యూస్‌కు, విక్రమ్ స్టయిల్, గెటప్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌కు దాదాపు 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ భారీ బడ్జెట్ చిత్ర ఆడియో వేడుకను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న టాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీల సమక్షంలో జె.ఆర్.సి. కన్వెక్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాం" అన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







