జనవరి 14న పెళ్లిచేసుకోనున్న విశాల్
- August 14, 2016
దక్షిణాది హీరో విశాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడట.. ఇంతకీ అమ్మాయి ఎవరంటే లక్ష్మీకరమైన అమ్మాయి అని అంటున్నాడు. సక్సెస్‌ఫుల్ కథానాయకుడిగా వెలుగొందుతున్న నటుడు విశాల్ పెళ్లిని చాలా కాలంగా వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం విశాల్ నటుడిగా నిర్మాతగా చాలా బిజీగా ఉన్నాడు. అంతేకాదు దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా తన బాధ్యతలను మోస్తున్నాడు. మరో వైపు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌తో ప్రేమాయణం అనే వదంతులను ఎదుర్కొంటున్నాడు. ఈ విషయం గురించి విలేకరులు చాలాసార్లు అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన ఒకే ఒక్క సమాధానం వరలక్ష్మీ శరత్‌కుమార్ నా బాల్య స్నేహితురాలన్నదే. కాగా ఇటీవల విశాల్ ఒక ఇంటర్వ్యూలో నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణం పూర్తి అయిన తరువాత అదే ఆవరణలో జరిగే పెళ్లి తనదే అవుతుందని పేర్కొన్నాడు. ఈ విషయం గురించి నడిగర్‌సంఘం కోశాధికారి కార్తీతో చర్చించినట్లు తెలిపాడు.అదే విధంగా లక్ష్మీకరమైన అమ్మాయితో ఏడడుగులు వేయనున్నట్లు తేల్చి చెప్పాడు. దీంతో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌నే ఆ లక్ష్మీకరమైన అమ్మాయి అనే ప్రచారం సోషల్ మీడియాల్లో హల్‌చల్ చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 14న తన వివాహం జరుగుతుందని, ఆ తేదీన సంఘ భవనంలో వివాహానికి ముందుగానే హాలును రిజర్వ్ చేసినట్లు విశాల్ వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రేమికులుగా ప్రచారం జరుగుతున్న విశాల్, వరలక్ష్మీ శరత్‌కుమార్ నిజంగా పెళ్లి చేసుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







