ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- July 28, 2026
న్యూ ఢిల్లీ: భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్-క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ (Vikram-1) ను విజయవంతంగా ప్రయోగించిన హైదరాబాద్ ఆధారిత స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ (Skyroot Aerospace) వ్యవస్థాపకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ చందన, నాగ భరత్ డాకాలతో ప్రధాని మోదీ భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం, సాంకేతికత మరియు భవిష్యత్ అవకాశాలపై ఆసక్తికరంగా చర్చించారు.
“యువత శక్తి, ఆశయాలకు ఇదో నిదర్శనం”: ప్రధాని మోదీ
సమావేశం అనంతరం ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ స్కైరూట్ బృందంపై ప్రశంసలు కురిపించారు. “స్కైరూట్ ఏరోస్పేస్ ఫౌండర్లు పవన్ చందన, నాగ భరత్ డాకాలతో గొప్ప సంభాషణ జరిగింది. వారి శక్తి, ఆశయాలు, సనుకూల ఆలోచనలు మన దేశంలోని ప్రైవేట్ అంతరిక్ష వ్యవస్థ (Private Space Ecosystem) యొక్క వినూత్న స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయి” అని ప్రధాని పేర్కొన్నారు. ‘విక్రమ్-1’ రాకెట్ ప్రయోగ విజయం, సంస్థ ఇప్పటివరకు సాగించిన ప్రయాణం మరియు రాబోయే రోజుల్లో వారు సాధించబోయే లక్ష్యాల గురించి తెలుసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ప్రధాని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ ప్రోత్సాహం మాకు ఎంతో స్పూర్తిదాయకం: స్కైరూట్
ప్రధాని మోదీతో భేటీ కావడం తమకు దక్కిన గొప్ప గౌరవమని స్కైరూట్ సంస్థ తెలిపింది. రాకెట్ తయారీలో ఉపయోగించిన సాంకేతికత, దీర్ఘకాలిక లక్ష్యాలు, మరియు భారతీయ స్పేస్ స్టార్టప్‌లకు రాబోయే అవకాశాల గురించి ప్రధానితో పంచుకున్నట్లు సంస్థ పేర్కొంది. దేశంలో పెరుగుతున్న ఇన్నోవేషన్ వ్యవస్థపై ప్రధానికి ఉన్న నమ్మకం, యువ పారిశ్రామికవేత్తలకు ఆయన ఇచ్చే ప్రోత్సాహం తమ బృందానికి నిరంతరం స్ఫూర్తినిస్తుందని స్కైరూట్ ప్రతినిధులు తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







