పెసరపప్పు హల్వా
- August 14, 2016
కావలసిన పదార్ధాలు:
పెసరపప్పు - మూడు కప్పులు , నెయ్యి - చిన్న కప్పు , చక్కెర - నాలుగు కప్పులు , పచ్చికోవా - ఒక కప్పు , యాలకుల పొడి - ఒక స్పూను , జీడిపప్పు - రెండు స్పూన్లు , టూటీ ఫ్రూటీ - కొద్దిగా
తయారు చేయు విధానం:
ముందుగా పెసరపప్పు కడిగి నీటిలో మూడుగంటలు నానబెట్టాలి. తర్వాత నానిన పప్పును బాగా కడిగి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాణలీలో నెయ్యి వేడిచేసి గ్రైండ్ చేసిన పెసరపప్పు ముద్దను వేసి, నెయ్యి పైకి వచ్చేలా సన్నని మంటపై కలుపుతూఉంటే పెసరపప్పు ముద్ద పచ్చిదనం పోతుంది. ఇప్పుడు దానిలో చెక్కెర, కోవా కలుపుకోవాలి. చెక్కెర, కోవాలు కరిగి పలచగా తయారవుతాయి. ఇది హల్వాముద్దలా గట్టిపడేవరకూ కలుపుతూవుండాలి. ఈ మిశ్రమం గట్టిపడేటప్పుడు కొంచెం మిఠాయి రంగు, యాలకుల పొడి వేసి దించాలి. ఇప్పుడు ఒక డిష్‌లో వేసి, పైన సన్నగా తరిగిన జీడిపప్పు, టూటీ ఫ్రూటీని వేసుకోవాలి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







