వంటింట్లో దొరికే వస్తువులతో చర్మం నవయౌవనంగా..
- August 14, 2016
అందమంటే ఖరీదైన క్రీములతోనే సాధ్యం కాదు... వంటింట్లో దొరికే వస్తువులతోనూ సులభంగా సాధ్యపడుతుంది. దీనికి మీరు చేయాల్సిందలా? కొంత శ్రద్ధా, సమయం పెట్టడమే!
బొ ప్పాయి సహజ పీలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగిస్తే చర్మంపై ఉండే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు తగ్గుతాయి. మరి ఎలా ఉపయోగించాలి....బొప్పాయి పండుని మెత్తగా చేసుకుని దానికి చెంచా చొప్పున నిమ్మరసం, బియ్యప్పిండి కలుపుకుని ముఖానికి పూతలా వేయాలి. పావుగంటయ్యాక ముఖం కడిగేసుకుంటే మీ సమస్య దూరమవుతుంది. చర్మ రంగూ మెరుగుపడుతుంది.
*
చర్మం అసలు వయసుకంటే ఎక్కువ కనిపిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కోడిగుడ్డులోని తెల్లసొన, కాసిని పాలు వేసి బాగా గిలకొట్టాలి. దానికి కాస్త తేనె చేర్చి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం నవయౌవనంగా కనిపిస్తుంది.
*
మృతకణాల్ని తొలగించాలంటే.. పావుకప్పు ఓట్స్‌ని ముందుగా పాలల్లో నానబెట్టుకోవాలి. దానికి చిటికెడు పసుపు, చెంచా పంచదార, నాలుగైదు బాదం గింజల ముద్ద వేసి కలపాలి. దాన్ని ముఖానికి రాసుకుని సవ్య, అపసవ్య దిశల్లో మర్దన చేయాలి. ఇలా పదినిమిషాలు చేశాక చల్లటి నీళ్లతో కడిగేసుకుని మాయిశ్చరైజర్ రాసుకుంటే సరి. చర్మం మృదువుగా మారుతుంది.
* కాలేజీ అమ్మాయిలు...తరచూ బయటతిరగడం వల్ల చర్మం నిగారింపు తగ్గుతుంది. కాలుష్యం, దుమ్మూ, ధూళి ఇందుకు కారణం కావొచ్చు. అందుకే తరచూ చన్నీళ్లతో ముఖం కడుక్కోవడం తప్పనిసరి. ఇంటికి వచ్చాక టొమాటోను గుండ్రంగా కోసి పంచదారలో అద్ది ముఖంపై మృదువుగా రుద్దాలి. ఇలా చేస్తే టొమాటోలోని పోషకాలు చర్మగ్రంథుల్లోకి చొచ్చుకుపోయి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. ఫలితంగా ముఖం తాజాగా కనిపిస్తుంది
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







