జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాల్పుల కలకలం
- August 14, 2016
న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాల్పుల కలకలం రేగింది. ఎయిర్ పోర్టు ప్రధాన టెర్మినల్ ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించడంతో భద్రతాసిబ్బంది గేట్టు మూసేసినట్లు ప్రధాన సాక్షులు చెప్తున్నారు. విమానాశ్రయంలోని ఉద్యోగులు, ప్రయాణీకులు ఎవ్వర్నీ బయటకు పోనీకుండా తలుపులు మూసివేసినట్లుగా సాక్షులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆదివారం రాత్రి భయోత్పాతాన్ని సృష్టించిన షూటర్లను పట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది గేట్లు మూసివేశారంటూ డాన్ ఆర్చర్ అనే వ్యక్తి ట్వీట్ చేయడంతో కాల్పుల వార్త.. వెలుగులోకి వచ్చింది.సోషల్ మీడియాద్వారా కాల్పుల వార్త వ్యాపించడంతో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ విమానాశ్రయం వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపింది. అయితే ఎన్ వై పిడి మాత్రం కాల్పుల విషయాన్ని ధృవీకరించలేదని అసోసియేటెడ్ ప్రెస్ నివేదికలను చెప్తున్నాయి. ఎయిర్ పోర్టులో కాల్పులకు సంబంధించిన ఎటువంటి సమాచారం అందుబాటులో లేనట్లు చెబుతోంది. మరోవైపు న్యూయార్క్ విమానాశ్రయం అధికారిక ట్విట్టర్ ఖాతాలో మాత్రం... వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని విమానాలు ఆలస్యంగా బయల్దేరుతున్నట్లు ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







