సముద్రంలో కళ్లు చెదిరే నీటిపై తేలియాడే విల్లాలు..
- August 14, 2016దుబాయ్ లో మరో అట్రాక్ష్క్షన్ సిద్దమవుతోంది. సముద్రంలో కళ్లు చెదిరే నీటిపై తేలియాడే విల్లాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచపటం ఆకారాల్లో దీవులు, వాటిపై ఇళ్లు నిర్మించారు.అదే విధంగా సముద్రంపై ఈత చెట్లు నిర్మించి వాటి మీద ఇళ్లు కట్టేశారు. ఈ ఎడారి దేశంలో తాజాగా సముద్రం నీటిపై తేలియాడే విల్లాలు నిర్మిస్తున్నారు.
డచ్ ఆర్కిటెక్చర్ సంస్థ 'న్యూ లివింగ్ఆన్ వాటర్' పేరుతో నీటిలో తేలియాడే విలాసవంతమైన ఫ్లోటింగ్ విల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.కోడిగుడ్డు ఆకారంలో 164 అడుగుల పొడవు, 98 అడుగుల వెడల్పు ఉండే ఒక్కో విల్లా మూడు అంతస్తులు ఉంటుంది. బేస్ మెంట్ మొత్తం కాంక్రీట్ తో నిర్మిస్తున్నారు.కాంక్రీట్ గదులలో సగభాగం నిండితే మిగిలిన సగాన్ని ఇంటిని నిలకడగా ఉంచేందుకు వాడుతారు. గ్రౌండ్ ఫ్లోర్ లో అధునాతనమైన నాలుగు బెడ్ రూమ్ లు, లివింగ్ రూమ్, కిచెన్ ఉంటుంది.ప్రతి బెడ్ రూమ్ కు ప్రత్యేకంగా ఔట్ డోర్ ప్యూ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మొదటి అంతస్తులో లివింగ్ రూమ్ , చిన్న సైజులో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసుకోవచ్చు.
సముద్రపు నీటితోనే గదులను చల్లబరిచేందుకు లేదా వెచ్చగా ఉంచేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. వినియోగదారులు కోరితే వీటికి సోలార్ ప్యానెల్స్ బిగించుకోవచ్చని సంస్థ నిర్వహకులు చెప్పారు.అలాగే విల్లాకు ఎక్కడికక్కడ నీటిని శుద్ది చేసే యంత్రాలు ఏర్పాటు చేస్తామని న్యూ లివింగ్ ఆన్ వాటర్ సంస్థ తెలిపింది. వచ్చే నెల 6వ తేదిన దుబాయ్ లో మొదలు కానున్న సిటీ స్కేప్ గ్లోబ్ ప్రదర్శనలో నమూనా ఇంటిని ప్రదర్శిస్తారు.
దాదాపు 16 వేల చదరపు అడుగుల వైశాల్యం ఉండే అలల్లాంటి ఒక్కోవిల్లా ఖరీదు దాదాపు రూ. 70 కోట్లు ఉంటుందని సంస్థ నిర్వహకులు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







