జాబ్ కోసం ప్రభుత్వ ఉద్యోగికి లంచం.. ముగ్గురికి రెండేళ్ల జైలుశిక్ష..!!
- July 30, 2026
మనామా: ప్రభుత్వ ఉద్యోగికి లంచం ఇచ్చి తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నించిన ముగ్గురికి బహ్రెయిన్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి బీడీ 1,400 జరిమానా విధించింది. శిక్ష పూర్తయిన అనంతరం తొలి నిందితుడిని బహ్రెయిన్ నుంచి బహిష్కరించాలని కూడా కోర్టు ఆదేశించింది.
కేసు వివరాల ప్రకారం.. తన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు సహకరించాలని కోరుతూ నిందితులు ఒక ప్రభుత్వ ఉద్యోగికి డబ్బు ఆఫర్ చేశారు. అయితే ఆ ఉద్యోగి వెంటనే ఈ విషయాన్ని అవినీతి నిరోధక విభాగం (Anti-Corruption Directorate) దృష్టికి తీసుకెళ్లాడు.
ఈ ఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. నిందితులు వ్యక్తిగతంగా కలుసుకుని బీడీ 1,400 లంచంగా ఇవ్వాలని ప్రయత్నించిన దృశ్యాలను రహస్యంగా రికార్డు చేసింది. దీంతో నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో కోర్టు వారికి రెండేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి బీడీ 1,400 జరిమానా విధించింది. మొదటి నిందితుడిని శిక్ష అనంతరం దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.
ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ అవినీతిని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. లంచం వంటి చర్యలు ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







