దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- August 01, 2026
దుబాయ్: జుమెరా లేక్ టవర్స్ (JLT) ప్రాంతంలో నివసించే వారు, ఉద్యోగులు, సందర్శకుల కోసం నే ‘JLT Link’ పేరుతో కొత్త పూర్తి ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ సేవ ద్వారా JLTలోని వివిధ క్లస్టర్లను DMCC మెట్రో స్టేషన్, సోభా రియాల్టీ మెట్రో స్టేషన్ తో అనుసంధానం చేశారు. ఈ కొత్త సర్వీస్ ప్రస్తుతం ఉన్న బస్ సర్వీస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రారంభించగా, నాలుగు పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు సేవలందించనున్నాయి.
రెండు రూట్లు.. 13 స్టాప్‌లు
JLT Link రెండు వేర్వేరు లూప్‌లలో సేవలు అందిస్తుంది.
* లూప్–1: JLT పశ్చిమ ప్రాంతంలోని A నుంచి N క్లస్టర్ల వరకు ప్రయాణించి DMCC మెట్రో స్టేషన్ కు అనుసంధానం చేస్తుంది. ఈ రూట్లో ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.
* లూప్–2: JLT తూర్పు ప్రాంతంలోని O నుంచి Z క్లస్టర్ల వరకు ప్రయాణించి సోభా రియాల్టీ మెట్రో స్టేషన్ కు అనుసంధానం చేస్తుంది. ఈ రూట్లో ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు నడుస్తుంది.
ఈ రెండు రూట్లలో కలిపి మొత్తం 13 బస్ స్టాప్లుఏర్పాటు చేశారు.
సేవల సమయాలు
* సోమవారం నుంచి శనివారం వరకు: ఉదయం 6:30 నుంచి రాత్రి 9:30 గంటల వరకు
* ఆదివారం: ఉదయం 9:30 నుంచి అర్ధరాత్రి 12:30 వరకు
టికెట్ ధర Dh3
ప్రతి ప్రయాణానికి Dh3 మాత్రమే చెల్లించాలి. ప్రయాణికులు JLT Link యాప్ ద్వారా ఖాతాలో డబ్బు జమ చేసి, QR కోడ్ ద్వారా చెల్లింపు చేయాలి. ప్రయాణానికి ముందస్తు బుకింగ్ అవసరం లేదు. సమీప బస్ స్టాప్‌కు వెళ్లి అందుబాటులో ఉన్న బస్సులో నేరుగా ప్రయాణించవచ్చు.
ప్రత్యేక సౌకర్యాలు
ప్రతి ఎలక్ట్రిక్ బస్సులో 23 సీట్లు ఉండగా, తక్కువ ఎత్తులో ప్రవేశ ద్వారం (Low-entry) ఏర్పాటు చేశారు. అలాగే వీల్‌చైర్ వినియోగదారుల కోసం ప్రత్యేక స్థలం కూడా కల్పించారు. డీఎంసీసీ (DMCC) ప్రకారం, ఈ జీరో ఎమిషన్ ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, JLT ప్రాంతంలో పర్యావరణహిత, సౌకర్యవంతమైన ‘లాస్ట్ మైల్’ రవాణా సేవలను అందించనున్నాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







