ప్రాంతీయ పరిస్థితులపై సల్మాన్–ట్రంప్ చర్చలు..!!
- August 02, 2026
జెడ్డా: సౌదీ అరేబియా యువరాజు, ప్రధాని మహ్మద్ బిన్ సల్మాన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిణామాలు, వాటి ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ప్రభావాలపై ఇరువురు నేతలు చర్చించారు.
ఈ సందర్భంగా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కూడా ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరమైన చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా అన్ని విధాలా ప్రయత్నాలు చేయాలని, దౌత్యపరమైన పరిష్కారాలకు మార్గం సుగమం చేయాలని ఆయన పేర్కొన్నారు.
దౌత్య చర్చల ద్వారా ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కాపాడడంతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ప్రతికూల ప్రభావాలు చూపే విస్తృత ఘర్షణలకు అవకాశం లేకుండా చూడాలని యువరాజు స్పష్టం చేశారు. అదేవిధంగా, సౌదీ అరేబియా–అమెరికా మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించిన ఇరువురు నేతలు, వివిధ రంగాల్లో ఆ సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై కూడా చర్చించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







