ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- August 05, 2026
దోహా: ఖతార్ సంస్కృతి, వారసత్వం, ప్రకృతి సౌందర్యాన్ని సంగీత రూపంలో ప్రపంచానికి పరిచయం చేస్తున్న ‘నబ్ద్ ఖతార్’ ఇప్పుడు ఖతార్ ఎయిర్వేస్ విమానాల ఇన్-ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ (IFE) వ్యవస్థలో అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 150కు పైగా గమ్యస్థానాలకు ప్రయాణించే ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులు విమాన ప్రయాణంలో ఈ ప్రత్యేక సంగీతాన్ని ఆస్వాదించడంతో పాటు, అధికారిక మ్యూజిక్ వీడియో, దాని నిర్మాణంపై రూపొందించిన డాక్యుమెంటరీని కూడా వీక్షించవచ్చు.
మీడియా సిటీ ఖతార్ రూపొందించిన ‘నబ్ద్ ఖతార్’ మ్యూజిక్ అల్బమ్ 2025లో ఖతార్ జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫిఫా అరబ్ కప్ ఖతార్ ఫైనల్లో తొలిసారిగా ఆవిష్కరించారు. ఖతార్ ప్రత్యేకతను ప్రతిబింబించే సహజ సౌండ్స్ ను సినీమాటిక్ ఆర్కెస్ట్రా సంగీతంగా మలిచి రూపొందించారు. అరేబియా గుర్రం పరుగుల శబ్దం, డేగ విహారం, ఎడారి గాలుల సవ్వడి వంటి సహజ ధ్వనులను సమన్వయం చేస్తూ దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచే గుండె చప్పుడుతో ఈ సంగీతాన్ని రూపొందించారు.
ఇన్-ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్లో భాగంగా ‘ఖతార్ సౌండ్బీట్’ డాక్యుమెంటరీని కూడా ప్రయాణికులు వీక్షించవచ్చు. ఇందులో సంగీత దర్శకుడు ఒమర్ రహ్బానీ, దర్శకుడు కరీమ్ రహ్బానీ, ఖతార్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా సభ్యులు, మీడియా సిటీ ఖతార్ బృందం ఈ ప్రాజెక్టు రూపకల్పన నుంచి పూర్తి స్థాయికి చేరిన ప్రయాణాన్ని వివరించారు. ఈ ప్రాజెక్టును మీడియా సిటీ ఖతార్ లైసెన్స్ పొందిన రహ్బానీ 3.0 సంస్థ స్థానిక కళాకారులు, సంగీత విద్వాంసులు, నిర్మాణ బృందాలతో కలిసి రూపొందించింది. స్టేడియంలో భారీ లైట్ షోగా ప్రారంభమైన ‘నబ్ద్ ఖతార్’ అనంతరం సోషల్ మీడియా వేదికల్లో 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.
ప్రస్తుతం ఖతార్ ఎయిర్వేస్ ప్రపంచవ్యాప్త నెట్వర్క్ ద్వారా ఈ మ్యూజిక్ అల్బమ్ అంతర్జాతీయ ప్రయాణికులకు చేరువవుతోంది. అలాగే యూట్యూబ్, స్పాటిఫై, అన్ఘామి వంటి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ‘నబ్ద్ ఖతార్’ అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్







