అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- August 05, 2026
రియాద్: సముద్ర తీరాలకు వెళ్లే ప్రజలు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ సూచించింది. అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లకుండా ఉండాలని, బీచ్‌ల వద్ద చిన్నారులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ప్రజల భద్రత కోసం అందుబాటులో ఉన్న సిబ్బంది, వనరులను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నట్లు బోర్డర్ గార్డ్ తెలిపింది. సముద్ర సెర్చ్ అండ్ రెస్క్యూ చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు వెల్లడించింది. అలాగే రక్షణ పడవలు, భద్రతా పరికరాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచడంతో పాటు సముద్రంలోకి బయలుదేరే ముందు అవసరమైన అన్ని అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించింది.
సముద్ర భద్రతా నిబంధనలు, అధికారుల సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని బోర్డర్ గార్డ్ మరోసారి విజ్ఞప్తి చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మక్కా, మదీనా, తూర్పు ప్రావిన్స్‌లలో 911, మిగతా సౌదీ ప్రాంతాల్లో 994 నంబర్లకు వెంటనే ఫోన్ చేసి సహాయం పొందాలని బోర్డర్ గార్డ్ సూచించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్







