మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం..మూడు దేశాల జెండా రంగుల్లో మెరిసిన సౌదీ ల్యాండ్‌మార్క్స్

- August 08, 2026 , by Maagulf
మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం..మూడు దేశాల జెండా రంగుల్లో మెరిసిన సౌదీ ల్యాండ్‌మార్క్స్

రియాద్: మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం (Makkah Joint Defense Agreement)పై సంతకాలు జరిగిన సందర్భంగా సౌదీ అరేబియా వ్యాప్తంగా ప్రముఖ ల్యాండ్‌మార్క్స్, టవర్లు ప్రత్యేకంగా వెలుగులతో మెరిశాయి.

శుక్రవారం రాత్రి సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ జాతీయ జెండాల రంగులతో పలు ప్రముఖ భవనాలు, టవర్లను అలంకరించారు. మూడు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసే ఒప్పందం కుదిరిన సందర్భంగా ఈ ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు.

సౌదీ, టర్కీ, పాకిస్థాన్ దేశాల జెండా రంగులతో వెలిగిన ల్యాండ్‌మార్క్స్ ఆకట్టుకున్నాయి. మూడు దేశాల మధ్య స్నేహం, పరస్పర సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీకగా ఈ వేడుక నిలిచింది.

మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం మూడు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com