'కపాలి' నుంచి హన్సిక మోత్వాని ఫస్ట్ లుక్ రిలీజ్
- August 09, 2026
హీరో రోహిత్ నారా ప్రస్తుతం పోలీస్ నేపథ్యంలో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'కపాలి' లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప నిర్మించగా, విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు. ఇందులో హన్సిక మోత్వాని కథానాయికగా నటిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా హన్సిక మోత్వానీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. హన్సిక పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇంటెన్స్ లుక్‌లో హన్సిక కనిపిస్తున్న ఈ పోస్టర్.. 'కపాలి' కథలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యతను సూచిస్తోంది. ఆమె చుట్టూ ఉన్న మిస్టీరియస్ ఎలిమెంట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
ఈ చిత్రంలోని మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
తారాగణం: రోహిత్ నారా, హన్సిక మోత్వాని
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: రామ్ గన్ని
సమర్పణ: విజయ్ కృష్ణ లింగమనేని
నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప
బ్యానర్: సప్త అశ్వ మీడియా వర్క్స్
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!







