APNRTS న్యూజెర్సీ స్టేట్ కో-ఆర్డినేటర్‌గా కొల్లి వంశీ
- August 10, 2026
అమెరికా: ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) న్యూజెర్సీ స్టేట్ కో-ఆర్డినేటర్‌గా మచిలీపట్నానికి చెందిన కొల్లి వంశీ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా కొల్లి వంశీ మాట్లాడుతూ, తనకు ఈ బాధ్యత అప్పగించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. న్యూజెర్సీలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రవాసులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
ప్రవాసాంధ్రులకు రాష్ట్రంతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, వారికి అవసరమైన సందర్భాల్లో APNRTS ద్వారా అందుబాటులో ఉన్న సేవలు, సహాయ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని వంశీ పేర్కొన్నారు.
మచిలీపట్నం నుంచి న్యూజెర్సీ వరకు తన ప్రయాణంలో తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన వంశీ, APNRTS న్యూజెర్సీ స్టేట్ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతాయుతంగా పనిచేస్తానని తెలిపారు.
కొల్లి వంశీ నియామకం పై ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు, మచిలీపట్నం ప్రాంతానికి చెందిన పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్







