వీధుల్లో వేధింపులపై అల్ ఖువాయిర్ నివాసితుల ఫిర్యాదు
- August 16, 2016
32 ఏళ్ళ మహిళ ఒంటరిగా వెళుతున్న సమయంలో ఆమెను కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారు. వాహనాల్లో నెమ్మదిగా వస్తూ, 'రేటెంత' అని అడుగుతుండడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు అల్ ఖువాయిర్ ప్రాంతంలో నిత్యకృత్యమైపోయాయని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 14 నుంచి 15 ఏళ్ళలోపు యువకులు ఎక్కువగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు వాపోతున్నారు. రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు తనిఖీలు నిర్వహిస్తున్నా, చాలా సందర్భాల్లో యువత తప్పించుకుంటున్నారనీ, 14 నుంచి 15 ఏళ్ళ లోపు వారే కావడంతో వారి పట్ల ఎవరికీ అనుమానం రావడంలేదని బాధితులు వాపోయారు. పోలీసులకు ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







