'సెయాన్' రెండవ షెడ్యూల్ ప్రారంభం
- August 11, 2026
శివకార్తికేయన్, శివకుమార్ మురుగేశన్, కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, ఆర్కేఎఫ్ఐ, టర్మరిక్ మీడియా 'సెయాన్' రెండవ షెడ్యూల్ ప్రారంభం
వెర్సటైల్ స్టార్ శివకార్తికేయన్, కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్న 'సెయాన్'' ప్రాజెక్ట్ కోసం దర్శకుడు శివకుమార్ మురుగేశన్‌తో చేతులు కలిపారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న 'అమరన్' తర్వాత రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో శివకార్తికేయన్ చేస్తున్న చిత్రమిది. శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రోజు రెండవ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో శివకార్తికేయన్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ రూరల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు.
ఎమోషన్స్, మాస్ అప్పీల్, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఎంటర్టైనర్ గా సినిమా రూపొందనుంది.
ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వివేక్ విజయకుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, షాన్ లోకేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్‌గా సుప్రీమ్ సుందర్ పని చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను అరుణ్ వెంకటరామూడి రూపొందిస్తున్నారు.
తారాగణం: శివకార్తికేయన్, భాగ్యశ్రీ
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: శివకుమార్ మురుగేశన్
సమర్పణ: కమల్ హాసన్
నిర్మాతలు: కమల్ హాసన్ & ఆర్ మహేంద్రన్
బ్యానర్లు: రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా
సహ నిర్మాత: S. డిస్నీ
సంగీతం: సంతోష్ నారాయణన్
DOP: వివేక్ విజయకుమార్
ఎడిటర్: శాన్ లోకేష్
యాక్షన్ కొరియోగ్రఫీ: సుప్రీమ్ సుందర్
ప్రొడక్షన్ డిజైన్: అరుణ్ వెంజరమూడు
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు
- లిబియాలో రష్యా నౌకపై డ్రోన్ దాడి అనుమానం.. బెంఘాజీ నౌకాశ్రయంలో భారీ పేలుడు
- రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!!
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!







