షార్జాలో మట్టితో నంబర్ ప్లేట్ దాచిన డ్రైవర్ అరెస్ట్..!!
- August 12, 2026
షార్జా: ట్రాఫిక్ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు వాహనం నంబర్ ప్లేట్‌పై మట్టి పూసి దాచిన ట్రక్ డ్రైవర్‌ను షార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ వాహనాలకు అనుమతి లేని ప్రాంతాల్లో ట్రక్‌ను నడుపుతూ నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు. అధునాతన ట్రాఫిక్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా వాహనాన్ని గుర్తించిన పోలీసులు.. సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థలు, ఆధునిక డిజిటల్ టెక్నాలజీ సాయంతో ట్రక్‌ను ట్రాక్ చేశారు. అనంతరం ప్రత్యేక బృందాలు గాలింపు, క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాయి.
వాహనం నంబర్ ప్లేట్‌ను దాచడం, దానిపై ఉన్న వివరాలను మార్చడం లేదా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని షార్జా పోలీసులు హెచ్చరించారు. ఎమిరేట్‌లోని అన్ని రహదారులను పర్యవేక్షించేలా అధునాతన నిఘా వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా భారీ వాహనాల డ్రైవర్లు నిర్దేశిత మార్గాలు, సమయాలు, లేన్లను తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా వాహనాలు నడపాలని సూచించారు. నిబంధనల అమలు వల్ల ఉల్లంఘనలు, ప్రమాదాలు తగ్గడంతో పాటు రహదారి భద్రత మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
Dh20,000 నుంచి జరిమానా
ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 14/2024లోని ఆర్టికల్ 34 ప్రకారం.. వాహనాన్ని వినియోగిస్తున్న సమయంలో నంబర్ ప్లేట్‌పై ఉన్న వివరాలను మార్చడం, చెరిపివేయడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి నేరాలకు జైలు శిక్షతో పాటు కనీసం Dh20,000 జరిమానా లేదా ఈ రెండింటిలో ఏదో ఒక శిక్ష విధించే అవకాశం ఉంది. అనుమతి లేకుండా ఒక వాహనం నంబర్ ప్లేట్‌ను మరో వాహనానికి మార్చడం వంటి చర్యలపైనా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు
- లిబియాలో రష్యా నౌకపై డ్రోన్ దాడి అనుమానం.. బెంఘాజీ నౌకాశ్రయంలో భారీ పేలుడు
- రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!!
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!







