కువైట్‌లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- August 13, 2026
కువైట్: ప్రైవేట్ ఫార్మసీల ఏర్పాటుకు సంబంధించి కువైట్ ప్రభుత్వం కీలక నిబంధనలు తీసుకొచ్చింది. ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవధీ జారీ చేసిన మంత్రిత్వ శాఖ తీర్మానం నంబర్ 235/2026 ద్వారా ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సింగ్, నిర్వహణ, మందులు మరియు వైద్య ఉత్పత్తుల నిల్వకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు.
కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పటికే ఉన్న ఫార్మసీకి అన్ని దిశల్లో కనీసం 1,000 మీటర్ల దూరంలోనే కొత్త ఫార్మసీని ఏర్పాటు చేయాలి. అయితే కోఆపరేటివ్ సొసైటీలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, విమానాశ్రయాలు, యూనివర్సిటీలు, ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ఫార్మసీలకు కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఇప్పటికే కొనసాగుతున్న ఫార్మసీలకు లైసెన్స్ రెన్యూవల్ లేదా ప్రాంత మార్పు సమయంలో నిబంధనలను సర్దుబాటు చేయనున్నారు.
ఫార్మసీలు ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని ఎంపిక చేసుకునేందుకు మూడు నెలల గడువు ఇవ్వనున్నారు. అవసరమైతే మరో మూడు నెలలు పొడిగించే అవకాశం ఉంటుంది.
ప్రైవేట్ ఫార్మసీ లైసెన్స్ నాలుగేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. ఫార్మసీలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండాలి. రిఫ్రిజిరేషన్ అవసరమైన మందులను 2°C నుంచి 8°C మధ్య ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. గడువు ముగిసిన మందులను ఇతర మందుల నుంచి వేరుగా, సురక్షితంగా ఉంచాలి.
ఫార్మసిస్టులపై కూడా నిబంధనలు
ప్రతి ఫార్మసీ యజమాని లైసెన్స్ కలిగిన మేనేజర్‌ను నియమించాలి. ఒక మేనేజర్ ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఫార్మసీలను నిర్వహించకూడదు. అలాగే నాన్-కువైటీ ఫార్మసిస్టులను నియమించే ఫార్మసీల్లో కనీసం ఒక లైసెన్స్ కలిగిన కువైటీ ఫార్మసిస్ట్ తప్పనిసరిగా ఉండాలి. ఫార్మసిస్టులు, టెక్నీషియన్ల హాజరు, పని గంటల రికార్డులు నిర్వహించడంతో పాటు వారి పని గంటలపై నెలవారీ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ద్వారా కువైట్‌లో ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సింగ్, మందుల నిల్వ, సిబ్బంది నిర్వహణపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేయనున్నారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







