ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- August 13, 2026
కువైట్: ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతుండటంతో వస్తువుల ధరలు పెరగకుండా ఉండేందుకు.. దేశంలో సరుకుల సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రత్యామ్నాయ షిప్పింగ్ మార్గాలను అన్వేషిస్తున్నట్లు కువైట్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. హోర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న పరిణామాలు సముద్ర రవాణా, షిప్పింగ్ మార్గాలపై చూపుతున్న ప్రభావంపై చర్చించేందుకు మంత్రిత్వ శాఖకు చెందిన కమర్షియల్ కంట్రోల్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ విభాగం బుధవారం షిప్పింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైంది.
ఈ సందర్భంగా విభాగం డైరెక్టర్ ఫైసల్ అల్ అన్సారీ మాట్లాడుతూ.. ప్రాంతీయ పరిస్థితుల కారణంగా రవాణా, షిప్పింగ్, బీమా, లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. దీంతో కువైట్‌కు వస్తువులను సరఫరా చేసే మొత్తం వ్యయం కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. కంటైనర్ల రవాణా ఖర్చులు భారీగా పెరిగాయని షిప్పింగ్ కంపెనీలు మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువచ్చాయి. ఈ ప్రభావం వస్తువులు, ఉత్పత్తుల ధరలపై పడే అవకాశం ఉందని తెలిపాయి.
ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ షిప్పింగ్ మార్గాలు, నౌకాశ్రయాలను వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీలు వెల్లడించాయి. అవసరమైన సందర్భాల్లో వివిధ గల్ఫ్ దేశాల ద్వారా కంటైనర్లను సేకరించడం, స్వీకరించడం వంటి మార్గాలను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల వినియోగం ద్వారా సరుకుల రవాణాలో జాప్యాన్ని, అదనపు షిప్పింగ్ ఖర్చులను తగ్గించవచ్చని అల్ అన్సారీ తెలిపారు. అదే సమయంలో కువైట్‌కు వస్తువుల సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.
పెరిగిన షిప్పింగ్ ఖర్చుల ప్రభావాన్ని తగ్గించేందుకు తగిన పరిష్కార మార్గాలను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం, వస్తువుల ధరల్లో స్థిరత్వాన్ని కొనసాగించడం, స్థానిక మార్కెట్లో సరుకుల లభ్యతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటమే లక్ష్యమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







