కేటీఆర్ అభినందనలు 'పెళ్ళిచూపులు' టీంకి..
- August 16, 2016
తక్కువ బడ్జెట్తో తెరకెక్కి విడుదలైన అన్ని సెంటర్లలో మంచి కలెక్షన్లు సాధించిన చిత్రం పెళ్ళి చూపులు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రంపై తెలంగాణ ఐటి శాఖా మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. పెళ్ళి చూపులు యూనిట్ కేటీఆర్ కోసం స్పెషల్ షో వేయగా.. రీసెంట్ గా ఈ చిత్రాన్ని వీక్షించారు. మూవీ లైన్ కేటీఆర్కి విపరీతంగా నచ్చేసింది. దీంతో ఆయన వెంటనే ట్విట్టర్లో తరుణ్ అండ్ టీంని అభినందించారు. అంతేకాదు ఈ చిత్రంకు సంబంధించి కొన్ని విషయాలు తెలియజేశారు. పెళ్ళి చూపులు చిత్రం అనేక విభాగాల్లో కొత్త దారులు వేసింది. ఎలాంటి నీతులు చెప్పకుండా పెళ్ళి చూపులు అందరిని ఆకర్షిస్తోంది. అసాధారణమైన ప్రొఫెషన్స్, మహిళా సాధికారికత, వ్యాపార సామర్ధ్య స్పూర్తిని రగిలించడం వంటివి చాలా ఉన్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పెళ్ళి చూపులు చిత్రాన్ని రీమేక్ చేయాలని ఇప్పటికే పలు భాషా నిర్మాతలు ప్లాన్ చేస్తోండగా కేటీఆర్ ట్వీట్తో ఈ చిత్రానికి మరింత క్రేజ్ పెరగడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







