తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- August 15, 2026
కువైట్: తల్లి పదునైన ఆయుధంతో దాడి చేయడంతో గాయపడిన ఇద్దరు చిన్నారులను కువైట్ ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లిన మంత్రి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న చికిత్స, వైద్య ప్రణాళికపై వైద్య బృందం మంత్రికి వివరించింది. చిన్నారులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు, సంరక్షణ అందించాలని మంత్రి ఆదేశించారు.
ప్రజా భద్రతకు, కుటుంబ సంక్షేమానికి ముప్పు కలిగించే నేరాలను ఏమాత్రం సహించబోమని షేక్ ఫహద్ స్పష్టం చేశారు. పిల్లల రక్షణలో తల్లిదండ్రుల బాధ్యతతో పాటు కుటుంబాల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తామని, ఎలాంటి మినహాయింపులు లేకుండా ప్రతి ఒక్కరిపై చట్టాన్ని అమలు చేస్తామని మంత్రి తెలిపారు.
చిన్నారులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళను భద్రతా బలగాలు అరెస్టు చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆమెపై అవసరమైన చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని, అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేస్తున్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







