సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- August 15, 2026
న్యూ ఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు రెండు శతాబ్దాల బ్రిటీష్ వలస పాలనకు ముగింపు పలికి దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా ఆయన ఘనంగా స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలు, స్ఫూర్తితో సమైక్య మరియు సమర్థవంతమైన భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆకాంక్షించారు. నేడు 140 కోట్ల మంది భారతీయుల సామర్థ్యం, నిరంతర శ్రమతో దేశం అన్ని రంగాల్లోనూ ప్రగతి శిఖరాలను అధిరోహిస్తోందని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే విజయోత్సవ ప్రయాణం ఇలాగే వేగవంతంగా ముందుకు సాగాలని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజ్ ఘాట్ వద్ద మహాత్ముడికి ఘన నివాళి..ప్రతిధ్వనించిన ‘రఘుపతి రాఘవ’
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఆరంభంలో ప్రధాని మోదీ ఢిల్లీలోని రాజ్ ఘాట్‌ను దర్శించి, జాతిపిత మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి అర్పించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్ముడు చూపిన అహింసా మార్గాన్ని, చేసిన అమూల్యమైన త్యాగాలను మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రధాని నివాళులర్పిస్తున్న సమయంలో రాజ్ ఘాట్ ప్రాంగణంలో ఆత్మీయంగా ప్రతిధ్వనించిన ‘రఘుపతి రాఘవ రాజారామ్’ సంకీర్తన వాతావరణాన్ని మరింత ఆధ్యాత్మికంగా, భావోద్వేగభరితంగా మార్చింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







