అపార్ట్మెంట్ యొక్క బాల్కనీ నుండి దూకి యువకుని ఆత్మహత్య
- August 16, 2016
షార్జ: ఒక ఎత్తైన అపార్ట్మెంట్ యొక్క బాల్కనీ నుండి 22 ఏళ్ల యువకుడు కిందకు దూకి చనిపోయాడు. ఈ దుర్ఘటన మంగళవారం మధ్యాహ్నం షార్జా లోని జమాల్ అబ్దుల్ నాజర్ వీధిలో జరిగింది. ఒక షార్జా పోలీస్ అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ , ఈ లెబనీస్ వ్యక్తి భూమిని తాకిన వెంటనే తక్షణమే మరణించాడని తెలిపారు.
పోలీసులు మరియు అంబులెన్సులు తక్షణమే సంఘటన స్థలంకు చేరుకొన్నారు. పోలీసు ఆపరేషన్ గదికి సాయంత్రం 5 గంటల సమయంలో ఈ సంఘటన గురించి ఒక పిర్యాదు అందుకున్నామని ఆ తర్వాత అక్కడకు పంపినట్లుఅధికారులు చెప్పారు.
లెబనీస్ యువకుని మృతదేహాన్ని అల్ కువైట్ హాస్పిటల్ తరలించారు. ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పలువురు భావిస్తున్నారు.ఈ దుర్ఘటన వెనుక కారణాల గూర్చి అల్ బుహారః పోలీస్ విచారణ ప్రారంభించారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







