దుబాయ్ మనీలా విమానంలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
- August 16, 2016
దుబాయ్ నుంచి మనీలా వెళుతున్న విమానంలోని ఓ మహిళకు ఆకస్మికంగా డెలివరీ పెయిన్స్ రావడంతో మార్గమధ్యలో విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇండియాలోని హైదరాబాద్లో ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. డయానె టియోడోరో అనే మహిళ గర్భవతి. ఆమె దుబాయ్ నుంచి మనీలాకు సెబు పసిఫిక్ విమానంలో ప్రయాణిస్తోంది. మార్గమధ్యంలో డెలివరీ పెయిన్స్ రావడంతో, అత్యవసరంగా విమానంలో ఉన్న నర్స్ల ద్వారా ఆమెకు సకాలంలో వైద్య సహాయం అందించారు. ముందుగా విమానాన్ని బ్యాంకాక్లో ఎమర్జన్సీ ల్యాండింగ్ చెయ్యాలనుకున్నా, దానికి సమయం పడుతుంది గనుక, ఇంకా తక్కువ సమయంలో ల్యాండ్ అయ్యేందుకు వీలున్న హైదరాబాద్ వైపుకు పైలట్స్ నడిపించారు. అదృష్టవశాత్తూ తల్లితోపాటు బిడ్డ కూడా క్షేమంగా ఉన్నారు. ఆ సమయంలో విమానంలో 269 మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. 36,000 అడుగుల ఎత్తులో బిడ్డకు జన్మనివ్వడం పట్ల ప్రయాణీకులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం వైద్య పరీక్షల తర్వాతే గర్భిణీలకు విమానంలోకి అనుమతిస్తారు. ఆ అనుమతి పత్రంతోనే డయానె విమానయానం చేశారు. అయితే ప్రీ మెచ్యూర్ పెయిన్స్ రావడంతో ప్రీ మెచ్యూర్ బేబీకి ఆమె జన్మనిచ్చారు. అదీ ఆకాశంలో. తల్లి, బిడ్డ పరిస్థితి ఆరోగ్యంగానే ఉందని విమానాశ్రయంలోని వైద్యాధికారులు ధృవీకరించారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







