దుబాయ్ సిలికాన్ ఒయాసిస్‌లో పెయిడ్ పార్కింగ్
- August 16, 2016
దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ (డిఎస్‌ఓ) ఇప్పటివరకూ పార్కింగ్ పరంగా ఫ్రీజోన్ ఏరియాలా ఉన్నా, త్వరలో పెయిడ్ పార్కింగ్ సిస్టమ్‌ని ఇక్కడా అమలు చేయనుంది రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ). పేమెంట్‌కి సంబంధించి విధి విధానాలు అతి త్వరలో ఖరారు కానున్నాయి. సైన్ బోర్డ్స్ ఏర్పాటు పనులు ఇప్పటికే జోరందుకున్నాయి. మిగతా ఫ్రీజోన్ ప్రాంతాల్లోనే ఇక్కడా సీజనల్ పార్కింగ్ కార్డ్స్‌ని అనుమతిస్తారు. ఆర్‌టిఎ నిబంధనల ప్రకారం యాన్యువల్, బై యాన్యువల్, క్వార్టర్లీ పార్కింగ్ కార్డులు టెకామ్, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, దుబాయ్ మీడియా సిటీ, నాలెడ్జ్ విలేజ్, డేరా ఫిష్ మార్కెట్, గోల్డ్ సౌక్ వంటి ప్రాంతాల్లో అనుమతించబడవు. డిఎస్‌ఓ 7.2 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో రూపొందించబడిన అర్బన్ కమ్యూనిటీ. డిఎస్‌ఓ వర్గాలు చెబుతున్నదాన్నిబట్టి 162,000 మంది ఇక్కడ నివాసం ఉండటం, లేదా పని చేయడం జరుగుతుందని తెలియవస్తోంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







