వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- August 16, 2026
మస్కట్: వినియోగదారుల హక్కుల పరిరక్షణలో భాగంగా ఒమన్ వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CPA) గత ఏడు రోజుల్లో పలు కీలక చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన వాణిజ్య సంస్థలపై చర్యలు తీసుకోవడంతో పాటు.. వినియోగదారులకు నష్టపరిహారం అందించింది. పలు వాహనాలను రీకాల్ చేసింది.
దక్షిణ అల్ బతీనా గవర్నరేట్‌లోని ఓ వాణిజ్య దుకాణంపై కోర్టు చర్యలు చేపట్టింది. సంబంధిత సంస్థ చేసిన ఉల్లంఘనలకు సంబంధించి దుకాణాన్ని మూసివేయాలని, నిందితులకు జైలు శిక్ష విధించాలని, జరిమానాలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మస్కట్ గవర్నరేట్‌లో రెండు కుర్చీల తయారీ సంస్థలను, తలుపుల విక్రయం, ఇన్స్టాలేషన్ నిర్వహిస్తున్న మరో సంస్థను సీపీఏ మూసివేసింది. వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించే క్రమంలో అల్ దఖిలియా, దక్షిణ అల్ బతీనా గవర్నరేట్లలో వినియోగదారులకు OMR 3,000కుపైగా మొత్తాన్ని తిరిగి ఇప్పించినట్లు సీపీఏ వెల్లడించింది.
55 కియా కార్ల రీకాల్
భద్రత లేదా సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని 2021 నుంచి 2025 మధ్య తయారైన 55 కియా వాహనాలను రీకాల్ చేసింది. మస్కట్‌లో స్పోర్ట్స్ పరికరాలను విక్రయించే ఓ సంస్థపై కూడా చర్యలు తీసుకుంది. లోపభూయిష్టమైన పరికరాలను వినియోగదారుల పరిరక్షణ నిబంధనల ప్రకారం మరమ్మతు చేయడం లేదా మార్చి ఇవ్వడంలో విఫలమైనందుకు సంస్థకు జరిమానా విధించింది.
2,084 బీఎండబ్ల్యూ వాహనాల రీకాల్
ఇదిలా ఉండగా.. 2018 నుంచి 2026 మోడల్ సంవత్సరాలకు చెందిన 2,084 బీఎండబ్ల్యూ వాహనాలను కూడా రీకాల్ చేస్తున్నట్లు సీపీఏ ప్రకటించింది. స్టార్టర్ మోటార్లో సంభవించే అవకాశం ఉన్న లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల హక్కులు, ఉత్పత్తుల భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించినప్పుడు చట్టపరమైన, సరిదిద్దే చర్యలు తీసుకోవడంతో పాటు.. వాణిజ్య సంస్థలు, ఉత్పత్తులు, సేవలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సీపీఏ తెలిపింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







