సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- August 16, 2026
రియాద్: సౌదీ అరేబియాలో ఆన్లైన్ గేమింగ్ సేవల నాణ్యత మెరుగుపడింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ గేమ్‌లలో లేటెన్సీ రేట్లు 89 శాతం మెరుగుపడినట్లు కమ్యూనికేషన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ కమిషన్ (CST) వెల్లడించింది. CST విడుదల చేసిన ‘సౌదీ ఇంటర్నెట్’ నివేదిక ఐదో ఎడిషన్‌లో దేశంలో ఇంటర్నెట్ వినియోగం, గేమింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) రంగాలకు సంబంధించిన పలు వివరాలను వెల్లడించింది.
ప్రముఖ గేమ్‌లలో లేటెన్సీ రేట్లు గణనీయంగా తగ్గినట్లు నివేదిక తెలిపింది. టీమ్ ఫైట్ టాక్టిక్స్, లీగ్ ఆఫ్ లేజెండ్స్ (Teamfight Tactics, League of Legends) గేమ్‌లలో లేటెన్సీ 11 మిల్లీసెకన్లకు, మొబైల్ లెజేండ్స్ (Mobile Legends)లో 12 మిల్లీసెకన్లకు చేరింది. గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో స్మార్ట్ డివైజ్‌లు 22.1 శాతం వినియోగంతో మొదటి స్థానంలో ఉండగా, ప్లేస్టేషన్ 21.8 శాతంతో తర్వాతి స్థానంలో నిలిచింది. గేమింగ్ ఫ్రీక్వెన్సీలో వారానికి ఒకసారి గేమ్స్ ఆడేవారు 32.1 శాతంతో ముందున్నారు. అప్పుడప్పుడు గేమింగ్ చేసే వారు 31 శాతం, ప్రతిరోజూ గేమ్స్ ఆడేవారు 29.2 శాతంగా ఉన్నారు.
1.38 కోట్లకు చేరిన ఐఓటీ సబ్స్క్రిప్షన్లు
సౌదీ అరేబియాలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వినియోగం కూడా వేగంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఐఓటీ సబ్స్క్రిప్షన్ల సంఖ్య 13.85 మిలియన్లకు చేరినట్లు CST తెలిపింది. నారోబాండ ఇంటర్నెట్ థింగ్స్ (NB-IoT) ద్వారా పట్టణ ప్రాంతాల్లో జనాభా కవరేజీ దాదాపు 99 శాతానికి చేరింది. దేశంలోని ఇళ్లలో ఐఓటీ వినియోగం 18 శాతానికి చేరినట్లు తెలిపింది.
గేమింగ్, పరికరాల మధ్య కనెక్టివిటీపై ఆధారపడే అప్లికేషన్లు సహా పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగాన్ని ఎదుర్కొనేందుకు సౌదీ అరేబియా డిజిటల్ మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయని CST పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలోనూ సౌదీ అరేబియా డిజిటల్ సామర్థ్యం మెరుగ్గా ఉందని నివేదిక తెలిపింది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) 2025 డిజిటల్ రెడీనెస్ ఇండెక్స్‌లో సౌదీ అరేబియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు CST వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







