అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- August 16, 2026
అబుదాబి: అబుదాబి ఇంటర్నేషనల్ హంటింగ్ అండ్ ఈక్వెస్ట్రియన్ ఎగ్జిబిషన్ (ADIHEX)కు ముందు నిర్వహించిన ఫాల్కన్ వేలంలో ఓ వైట్ ఫాల్కన్ ఏకంగా Dh250,000కు అమ్ముడుపోయింది. ఈ ఏడాది వేలం సిరీస్‌లో ఇదే తొలి వేలం అని నిర్వాహకులు తెలిపారు. ‘జీర్ ప్యూర్ సూపర్ వైట్’ జాతికి చెందిన ఈ ఫాల్కన్‌కు వేలంలో ప్రారంభ ధర పెరుగుతూ వచ్చింది. చివరకు ఖాలిద్ బిన్ సైఫాన్ ఒకేసారి తన బిడ్‌ను Dh210,000 నుంచి Dh250,000కు పెంచి ఫాల్కన్ ను సొంతం చేసుకున్నాడు
ఏడు ఫాల్కన్లకు వేలం
అబుదాబిలోని ADNEC సెంటర్‌లో మొత్తం ఏడు ఫాల్కన్లను వేలం వేశారు. వీటిలో అత్యధిక ధర పలికింది జీర్ ప్యూర్ సూపర్ వైట్ ఫాల్కన్‌కే. ADIHEX సందర్భంగా మొత్తం ఎనిమిది వేలం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండో వేలం ఆదివారం జరగనుండగా.. ఆగస్టు 22, 23 తేదీల్లో మరో రెండు వేలాలు జరగనున్నాయి. మిగిలిన నాలుగు వేలాలు ఎగ్జిబిషన్ ప్రధాన కార్యక్రమం సందర్భంగా నిర్వహిస్తారు.
వివిధ జాతుల ఫాల్కన్లు
ఈ వేలాల్లో వివిధ రకాల రక్తసంబంధాలు, ఫార్మ్‌లకు చెందిన ఫాల్కన్లను అందుబాటులో ఉంచనున్నారు. ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లోనూ బిడ్డింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఫాల్కన్‌ల రూపం, రక్తసంబంధం, వేట సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా వాటిని కొనుగోలు చేసేందుకు యజమానులు, పెంపకందారులు, ఫాల్కన్రీ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది వేలంలో గర్మూషా ప్యూర్, గైర్ ప్యూర్ వంటి ఫాల్కన్ రకాలూ అందుబాటులో ఉండనున్నాయి.
ప్రెసిడెంట్స్ కప్‌లో పోటీకి అవకాశం
వేలంలో లేదా ADIHEXలో కొనుగోలు చేసిన అర్హత కలిగిన ఫాల్కన్లకు ADIHEX బ్యాడ్జ్ పొందే అవకాశం ఉంటుంది. దీని ద్వారా 2026-27 సీజన్‌లో జరిగే ప్రెసిడెంట్స్ కప్ ఫాల్కన్రీ పోటీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ADIHEX 23వ ఎడిషన్‌ను ADNEC గ్రూప్, ఎమిరేట్స్ ఫాల్కనర్స్ క్లబ్ సహకారంతో నిర్వహిస్తోంది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 6 వరకు అబుదాబి ADNEC సెంటర్‌లో ఈ ప్రదర్శన జరగనుంది.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







