రక్తదానం.. ప్రాణదానం..FOI ఈవెంట్స్ మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన
- August 17, 2026
దుబాయ్: “Be a Donor. Be a Hero!” అనే సందేశంతో FOI ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండిపెండెన్స్ డే మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్కు విశేష స్పందన లభించింది. దుబాయ్‌లోని DHA హెడ్ క్వార్టర్స్, జుర్ఫ్ వద్ద నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో సుమారు 300 మంది రక్తదానం చేసి తమ మానవతా స్ఫూర్తిని చాటుకున్నారు.
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి రక్తం అందించేందుకు సహకారం అందించారు. పెద్ద సంఖ్యలో భారతీయులు, ప్రవాసులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం పట్ల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ (Consulate General of India, Dubai) మరియు Dubai Health Authority (DHA) సహకారం అందించాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో FOI ఈవెంట్స్ టీమ్ సభ్యులు కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణు వర్ధన్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని సందర్శించి నిర్వాహకులు, వాలంటీర్లు మరియు రక్తదాతలను అభినందించారు.రక్తదానం ఒక గొప్ప మానవతా సేవ అని, ఒక్క యూనిట్ రక్తం కూడా విలువైన ప్రాణాన్ని కాపాడగలదని ఆయన పేర్కొన్నారు.
రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడంలో వెంకట రమణ, మల్లయ్య, సుకుమార్, గంగారం, యోగేష్, రంగనాథ్, హరి, గురుస్వామి, కృష్ణ చైతన్య, సామ శ్రీనివాస్, కొలసాని శ్రీనివాస్, ఇందు, మహేందర్ రెడ్డి, వినోద్ అర్మూరి, అజయ్ ఖన్నా, వినోద్ నాయర్, భాగ్యరాజ్, నరేష్ కుమార్ మాన్యం FOI ఈవెంట్స్ టీమ్ సభ్యులు కీలక పాత్ర పోషించారు.


తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







