అధిక ప్రమాద కార్యకలాపాలకు థర్డ్ పార్టీ బీమా.. సౌదీ అరేబియా కీలక నిర్ణయం..!!
- August 17, 2026
రియాద్: రద్దీగా ఉండే ప్రదేశాలు, అధిక ప్రమాదం ఉన్న కార్యకలాపాల కోసం థర్డ్ పార్టీ కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ పాలసీని సౌదీ అరేబియా ప్రారంభించింది. ఇన్సూరెన్స్ అథారిటీ, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ సంయుక్తంగా ఈ పాలసీని ప్రకటించాయి. ఈ పాలసీ ద్వారా సంబంధిత సంస్థలకు సివిల్ లయబిలిటీ కవరేజ్ లభిస్తుంది. కవర్ అయ్యే ప్రదేశాల్లో ప్రమాదాల కారణంగా సందర్శకులు, వినియోగదారులకు గాయాలు కావడం లేదా వారి ఆస్తులకు నష్టం వాటిల్లినప్పుడు పరిహారం అందించేందుకు ఈ బీమా ఉపయోగపడుతుంది. సందర్శకుల హక్కులను రక్షించడంతో పాటు, ప్రమాదాల కారణంగా ఏర్పడే ఆర్థిక, నిర్వహణ భారాన్ని సంస్థలు సమర్థంగా ఎదుర్కొనేలా చేయడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
తప్పనిసరి కానున్న బీమా
సంబంధిత కేబినెట్ నిర్ణయం ప్రకారం ఈ బీమా తప్పనిసరి కానుంది. తప్పనిసరి బీమా వర్తించే కార్యకలాపాలను నిర్వహించేందుకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ లైసెన్స్ పొందాలంటే ఈ పాలసీ కీలక నిబంధనగా మారనుంది. కార్యకలాపాల స్వభావం, వాటికి సంబంధించిన ప్రమాద స్థాయిని బట్టి అందించే పరిహారం మారుతుంది. పాలసీలో పేర్కొన్న నిబంధనలు, షరతులు, మినహాయింపులకు అనుగుణంగా బీమా కవరేజ్ అమలవుతుంది. దీనిని దశలవారీగా అమలు చేయనున్నారు.
ఇన్సూరెన్స్ అథారిటీ సీఈఓ నాజీ అల్-తమీమీ మాట్లాడుతూ, ఈ పాలసీ వ్యాపారాల స్థిరత్వానికి మద్దతు ఇవ్వడంతో పాటు, బీమా తప్పనిసరి చేసిన రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణను పెంచుతుందని తెలిపారు. ప్రమాదాల వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవడానికి సంస్థలకు ఈ బీమా సహాయపడుతుందని, తద్వారా కార్యకలాపాలను కొనసాగించడం, ప్రమాదాల అనంతరం త్వరగా కోలుకోవడం సులభమవుతుందని పేర్కొన్నారు. సౌదీ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా దేశ ఆర్థిక వృద్ధి, పెట్టుబడుల విస్తరణకు ఈ విధానం దోహదపడుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







