‘పళ్ళ బురుసు’ పై ప్రశంసలు కురిపించిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్
- August 17, 2026
అన్నపూర్ణ స్టూడియోస్ లేటెస్ట్ హిట్ ‘పళ్ళ బురుసు’. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది.
తాజాగా బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ‘పళ్ళ బురుసు’ సినిమాను ప్రశంసిస్తూ తన రివ్యూను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “బ్యూటిఫుల్ ఫిల్మ్. చాలా సింపుల్‌గా ఉంటుంది.. మీ ముఖంపై చిరునవ్వును అలాగే ఉంచుతుంది. ఒకదానికొకటి కాపీలా అనిపించే నాన్‌స్టాప్ యాక్షన్ సినిమాల నుంచి ఇది చాలా ఫ్రెష్‌గా అనిపించింది” అంటూ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అంతేకాదు.. దర్శకుడు ఉదయ్ చౌహాన్‌పై కూడా అనురాగ్ కశ్యప్ ప్రశంసలు కురిపించారు. “వెంకటేష్ మహా తర్వాత, నన్ను ఇంతగా ఇంప్రెస్ చేసిన దర్శకుడు ఉదయ్ చౌహాన్.” అంటూ ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు ‘పళ్ళ బురుసు’ టీమ్‌లో మరింత జోష్ నింపుతోంది.
ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ లాంటి వెటరన్ దర్శకుడి నుంచి వచ్చిన ప్రశంసలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







