సముద్ర రాకపోకలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు: యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ
- August 19, 2026
అబుదాబి: ఇరాన్ నుంచి ప్రయోగించినట్లు గుర్తించిన రెండు బాలిస్టిక్ క్షిపణులు సముద్ర రాకపోకలను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినవేనని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ రెండు క్షిపణులు సముద్రంలో పడిపోయినట్లు తెలిపింది.
యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ మంగళవారం గుర్తించిన ఈ రెండు బాలిస్టిక్ క్షిపణులపై నిర్వహించిన అంచనాల్లో.. వాటి లక్ష్యం సముద్ర రవాణా, నావిగేషన్‌కు సంబంధించిన ప్రాంతాలేనని నిర్ధారణ అయినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ముప్పులను ఎదుర్కొనేందుకు సిద్ధం
దేశ భద్రతకు ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు యూఏఈ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
దేశ భద్రతను దెబ్బతీసే ప్రయత్నాలను, ప్రాంతంలోని సముద్ర నావిగేషన్ భద్రతకు ముప్పు కలిగించే చర్యలను కఠినంగా ఎదుర్కొంటామని తెలిపింది.
యూఏఈ సార్వభౌమత్వం, భద్రత, స్థిరత్వాన్ని కాపాడటంతో పాటు దేశ జాతీయ ప్రయోజనాలు, ఆస్తులు, వనరులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ప్రాంతీయ సముద్ర రవాణా భద్రతకు ఎలాంటి ముప్పు ఏర్పడినా దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం, సన్నద్ధత యూఏఈ రక్షణ వ్యవస్థకు ఉందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







