హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ.. ప్రయాణికులకు కీలక సూచనలు..!!
- August 19, 2026
దోహా: వేసవి సెలవుల అనంతరం కుటుంబాలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో దోహాకు తిరిగి వస్తుండటంతో హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు నెలలో అత్యంత రద్దీగా ఉండే రాకపోకల కాలం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యం కోసం విమానాశ్రయ అధికారులు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు. చిన్నారులతో ప్రయాణించే కుటుంబాల కోసం విమానాశ్రయంలో ఉచిత చైల్డ్ స్ట్రోలర్లు అందుబాటులో ఉంటాయని, ఇవి టెర్మినల్‌లోని వివిధ కాన్‌కోర్స్‌లలో ఏర్పాటు చేసిన స్ట్రోలర్ ప్రాంతాల్లో లభిస్తాయన్నారు.
అలాగే కాన్‌కోర్స్ డీ, ఈ ప్రాంతాల్లోని నిర్దేశిత స్టేషన్ల నుంచి ఉచిత షటిల్ బగ్గీ సేవలు అందుబాటులో ఉంటాయి. సీట్ల లభ్యతను బట్టి మార్గమధ్యంలో కూడా ప్రయాణికులు ఈ బగ్గీలను ఎక్కవచ్చు. ఇవి ప్రయాణికులను అరైవల్స్ ఇమ్మిగ్రేషన్ ఎస్కలేటర్ల సమీపంలో దింపుతాయి. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసుకునేందుకు అర్హత ఉన్న ప్రయాణికులు స్కాన్ అండ్ గో, ఈ-గేట్లను ఉపయోగించుకోవచ్చని విమానాశ్రయం తెలిపింది. అయితే ఈ సేవను ఉపయోగించే పిల్లల కనీస ఎత్తు 120 సెంటీమీటర్లు ఉండాలి.కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను తీసుకెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చే వారు కార్ పార్కింగ్‌ను ఉపయోగించాలని అధికారులు సూచించారు. ఇది అరైవల్స్ హాల్‌కు సమీపంలో ఉండటంతో పాటు విమానాశ్రయం వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సహాయపడుతుంది.
దోహా నగరానికి వెళ్లే ప్రయాణికుల కోసం ఉబర్, BadrGo, Ryde వాహనాల పికప్ ప్రాంతాలు కార్ పార్కింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో, కార్ రెంటల్ బూత్‌ల పక్కన ఉన్నాయి. అధికారిక ట్యాక్సీలు, బస్సులు అరైవల్స్ హాల్ చుట్టూ ఉన్న నిర్దేశిత ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి. దోహా మెట్రో కూడా విమానాశ్రయం నుంచి కొద్ది దూరంలోనే ఉంటుంది. టెర్మినల్ నుంచి ఇండోర్ మార్గం ద్వారా మెట్రోకు చేరుకోవచ్చని తెలిపింది.
బ్యాగేజీ విషయంలో జాగ్రత్త
విమానానికి సంబంధించిన బ్యాగేజీ బెల్ట్ నంబర్‌ను బ్యాగేజీ రీక్లెయిమ్ ప్రాంతంలోని ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్లలో చూడవచ్చు. సాధారణ బ్యాగులతో పాటు ఓవర్‌సైజ్ బ్యాగేజీని కూడా కేటాయించిన బెల్ట్ వద్దే అందిస్తారు. బ్యాగ్ తీసుకున్న తర్వాత బ్యాగేజీ ట్యాగ్‌ను పరిశీలించి సరైన బ్యాగ్‌ను తీసుకున్నారా లేదా నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు. బ్యాగ్ కనిపించకపోయినా, ఏదైనా వస్తువు మిస్ అయినా అరైవల్స్ హాల్‌లోని బాగేజీ సర్వీసెస్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని పేర్కొంది. వీటితోపాటు కార్ రెంటల్, లిమోసిన్, వాలెట్ పార్కింగ్ వంటి సేవలు కూడా విమానాశ్రయంలో అందుబాటులో ఉన్నాయని హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







