అక్టోబర్ 1న అల్ షహీద్ పార్క్ ఫేజ్-3 ప్రారంభం..!!
- August 19, 2026
కువైట్ : కువైట్‌లోని ప్రముఖ అల్ షహీద్ పార్క్ మూడో దశ అక్టోబర్ 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. పార్క్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను కువైట్ కేబినెట్ సమీక్షించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక వివరాలను అమీరీ దివాన్ అండర్‌సెక్రటరీ షేక్ అబ్దులజీజ్ అల్ సబాహ్ కేబినెట్‌కు వివరించారు. మొత్తం 243,605 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మూడో దశను అభివృద్ధి చేశారు. ప్రారంభోత్సవానికి ముందు కుటుంబాలు, సందర్శకులను ఆకట్టుకునేలా వివిధ వినోద కార్యక్రమాలతో భారీ కార్నివాల్ నిర్వహించనున్నారు.
మూడో దశలో 203,162 చదరపు మీటర్ల మేర నిర్మాణ పనులు చేపట్టగా.. సుమారు 190,661 చదరపు మీటర్లలో గ్రీనరీ, గ్రీన్ స్పేస్‌లు ఏర్పాటు చేశారు. సమగ్ర ప్రజా పార్కుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ దశను తీర్చిదిద్దారు.
ప్రత్యేక ఆకర్షణలు ఇవే..
కొత్తగా అందుబాటులోకి రానున్న ప్రాంతంలో పలు వినోద, ఆహ్లాదకర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇందులో రోమన్ థియేటర్, ఓపెన్ ఎయిర్ సినిమా, జిమ్నాజియం, ఐస్ స్కేటింగ్ రింక్ ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. వీటితో పాటు రెస్టారెంట్లు, కేఫ్‌లను కూడా ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా.. కువైట్‌లో పలు కొత్త ఆరోగ్య ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు అమిర్ ఆమోదం తెలిపినట్లు కేబినెట్ వెల్లడించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు అమిర్ తరఫున ప్రధానమంత్రి హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







