ఖతార్ లో అధిక విద్యుత్ వినియోగ పరికరాల ఏర్పాటుపై అలెర్ట్..!!
- August 19, 2026
దోహా: ఇళ్లలో, వ్యాపార సంస్థల్లో కొత్తగా అధిక విద్యుత్ వినియోగించే పరికరాలను ఏర్పాటు చేసే ముందు వైరింగ్, విద్యుత్ వ్యవస్థ సామర్థ్యాన్ని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) సూచించింది.
కొత్తగా విద్యుత్ లోడ్ పెంచే సమయంలో ప్రస్తుతం ఉన్న వైరింగ్, విద్యుత్ ఇన్‌స్టాలేషన్లు అదనపు భారాన్ని తట్టుకోగలవా లేదా ముందుగానే పరిశీలించాలని పేర్కొంది. ముందస్తు తనిఖీలతో విద్యుత్ లోపాలు, ఓవర్‌లోడ్, సరఫరా అంతరాయాలు, భద్రతా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపింది. ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లు, అధిక విద్యుత్ వినియోగించే ఇతర పరికరాలు ఏర్పాటు చేసినప్పుడు విద్యుత్ వ్యవస్థపై అదనపు భారం పడే అవకాశం ఉందని కహ్రామా వెల్లడించింది. అందువల్ల పరికరాలను ఏర్పాటు చేసే ముందు సాంకేతిక నిపుణులతో విద్యుత్ వ్యవస్థను పరిశీలించుకోవాలని సూచించింది.
ఇళ్లతో పాటు వాణిజ్య సంస్థలు కూడా విద్యుత్ వ్యవస్థను విస్తరించే సమయంలో భద్రతా ప్రమాణాలను పాటించాలని కహ్రామా కోరింది. ముందస్తు జాగ్రత్తలతో విద్యుత్ సరఫరా మరింత విశ్వసనీయంగా కొనసాగడంతో పాటు ఆస్తులు, ప్రజల భద్రతను కాపాడుకోవచ్చని పేర్కొంది. లోడ్‌ను గణనీయంగా పెంచే వారు అర్హత కలిగిన నిపుణులను సంప్రదించి వైరింగ్, విద్యుత్ వ్యవస్థ సామర్థ్యాన్ని తనిఖీ చేయించుకోవాలని కహ్రామా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







