అబుదాబి ‘ది కార్స్’ కాన్సర్ట్ రద్దు.. టికెట్ డబ్బులు రీఫండ్..!!

- August 20, 2026 , by Maagulf
అబుదాబి ‘ది కార్స్’ కాన్సర్ట్ రద్దు.. టికెట్ డబ్బులు రీఫండ్..!!

అబుదాబి: ప్రముఖ ఐరిష్ కుటుంబ మ్యూజిక్ గ్రూప్ ‘ది కార్స్’ అబుదాబిలో నిర్వహించాల్సిన కాన్సర్టును రద్దు చేసింది. ఊహించని పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బృందం ప్రకటించింది. అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో సెప్టెంబర్ 27న ఇది జరగాల్సి ఉంది.  

కాన్సర్ట్ కోసం టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు పూర్తి రీఫండ్ అందజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. టికెట్లు కొనుగోలు చేసిన అసలు ప్లాట్‌ఫామ్ లేదా విక్రయ కేంద్రం నుంచే డబ్బులు తిరిగి పొందవచ్చని తెలిపారు.

నలుగురు తోబుట్టువులతో ‘ది కార్స్’

ఐర్లాండ్‌లోని డండాక్, కౌంటీ లౌత్‌కు చెందిన ‘ది కార్స్’ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫ్యామిలీ మ్యూజిక్ గ్రూప్. ఆండ్రియా, షారన్, కరోలిన్, జిమ్ అనే నలుగురు తోబుట్టువులు ఈ బృందంలో సభ్యులు. పాప్-రాక్ సంగీతాన్ని సంప్రదాయ ఐరిష్ జానపద సంగీతంతో మేళవించడం వీరి ప్రత్యేకత.

షకీరా, జోనస్ బ్రదర్స్ షోలు కూడా వాయిదా

ఇదిలా ఉండగా, అబుదాబిలో జరగాల్సిన ఆఫ్‌లిమిట్స్ మ్యూజిక్ ఫెస్టివల్ 2026ను వాయిదా వేయడంతో ప్రముఖ గాయని షకీరా, జోనస్ బ్రదర్స్ యూఏఈ కాన్సర్టులు కూడా వాయిదా పడ్డాయి.

2026 నవంబర్ 21న జరగాల్సిన ఈ ఫెస్టివల్‌లో షకీరా ప్రధాన ఆకర్షణగా ఉండగా.. జోనస్ బ్రదర్స్, NE-YO, ఐస్‌లాండ్‌కు చెందిన బ్లూస్-రాక్ బ్యాండ్ కాలోతో పాటు బేయూ, స్థానిక కళాకారిణి యారా ముస్తఫా తదితరులు ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంది.

ఫెస్టివల్ టికెట్లు కొనుగోలు చేసిన వారికి తాము టికెట్లు తీసుకున్న ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రీఫండ్ వివరాలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఫెస్టివల్‌ను 2027లో తిరిగి నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

క్రిస్టినా అగ్యిలేరా కచేరీ కూడా రద్దు

అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లోని ఎతిహాద్ అరేనాలో సెప్టెంబర్ 25న జరగాల్సిన క్రిస్టినా అగ్యిలేరా కాన్సర్ట్ కూడా రద్దైనట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. టికెట్ కొనుగోలు చేసిన వారికి పూర్తి రీఫండ్ అందే అవకాశం ఉందని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com