స్కూల్స్ రీ ఓపెన్.. సౌదీ ఫుడ్ అథారిటీ కీలక సూచనలు..!!
- August 20, 2026
రియాద్: సౌదీ అరేబియాలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ప్రతిరోజూ సమతుల్యమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించాలని సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) సూచించింది. దేశవ్యాప్తంగా పాఠశాలలు ఆగస్టు 23 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆరోగ్యకరమైన అల్పాహారం పిల్లలకు అవసరమైన శక్తి, పోషకాలను అందిస్తుందని SFDA తెలిపింది. ఇవి పిల్లల శారీరక ఎదుగుదల, చదువుపై ఏకాగ్రత, అభ్యాసం, శారీరక చురుకుదనంకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొంది.
పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో.. రోజును పోషక విలువలతో కూడిన అల్పాహారంతో ప్రారంభించడం వల్ల పిల్లలకు అవసరమైన శక్తి లభిస్తుందని వివరించింది. అల్పాహారంలో పండ్లు, కూరగాయలు చేర్చడం ద్వారా ఆహారంలో వైవిధ్యం పెరుగుతుందని, వాటి ద్వారా అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ లభించి పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయని SFDA తెలిపింది.
అల్పాహారంలో పాలు లేదా పాల ఉత్పత్తులు, ధాన్యాలు, ముఖ్యంగా సంపూర్ణ ధాన్యాలు, ప్రోటీన్ అందించే ఆహారం, పండ్లు లేదా కూరగాయలు, పరిమిత మోతాదులో కొవ్వు ఉండేలా చూసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ.. పిల్లల చదువు, ఏకాగ్రత, ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల్య అల్పాహారం కీలకమని SFDA స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







