మెంతులతో లడ్డూ.
- August 17, 2016
కావలసిన పదార్ధాలు:
మెంతులు - 1/2కప్పు
పాలు - 2కప్పులు
గోధుమపిండి - 1/4కిలో
నెయ్యి - 1కప్పు
బెల్లం లేదా పంచదార - 4కప్పులు
జీడిపప్పు, ద్రాక్ష - 1/2కప్పు
తయారు చేసే విధానం:
ముందుగా మెంతుల్ని పొడి చేసి ముందు రాత్రి పాలల్లో బాగా నానా పెట్టుకోవాలి. (రాత్రంతా మెంతి పొడిని నానపెట్టడం వలన చేదు ఉండదు). తర్వాత బాణలిలో నెయ్యి వేసి పాలు మెంతి పొడిని కలిపి నేతిలో వేసి ఎర్రగా వేయించాలి. తరువాత మరో బాణలిలో నెయ్యి వేసి గోధుమపిండిని కూడా వేయించాలి. తర్వాత మెంతి పిండిలో గోధుమపిండి, బెల్లం లేదా పంచదార, వేయించిన జీడిపప్పు, ద్రాక్ష, మిగతా నెయ్యి వేసి లడ్డులా చుట్టుకోవాలి.
అంతే మెంతి లడ్డూలు రేడి. వీటిని చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







