బొప్పాయి పండు ఆకుతో డెంగ్యూ వ్యాధికి చెక్ ..
- August 17, 2016
ఇటీవల ప్రజలను భయపెడుతున్న వ్యాధులలో డెంగ్యూ ఒకటి. వ్యాధి వచ్చిన వారికి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకచోట సరిగ్గా నిలుచోలేరు. కూర్చోలేరు. బెడ్‌కే పరిమితం కావల్సి వస్తుంది. గంటలు గడుస్తున్న కొద్దీ ఆరోగ్యం క్షీణించి ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. డెంగ్యూ వచ్చిన వారి రక్తంలో ఉండే ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా బాగా తగ్గుతుంది. సాధారణ వ్యక్తుల్లో ప్లేట్‌లెట్లు 1.50 లక్షల నుంచి 4.50 లక్షల మధ్య ఉంటే, డెంగ్యూ వచ్చిన వారిలో 1.50 లక్షల కన్నా తక్కువగా ఉంటుంది. గంటలు అయిన కొద్దీ ఇవి వేల సంఖ్యలో పడిపోతూనే ఉంటాయి. ఈ క్రమంలో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడం కోసం వైద్యులు పలు రకాల మందులను, విటమిన్ సప్లిమెంట్లను రోగులకు అందిస్తారు.
రోగి కొద్దిగా కోలుకున్న తరువాత డిశ్చార్జి చేస్తారు. కానీ కొన్ని రోజుల వరకు వారు మందులను సక్రమంగా తీసుకోవాల్సిందే. సరైన ఆహారం తినాల్సిందే. లేదంటే రోగం మళ్లీ తిరగబెట్టేందుకు అవకాశం ఉంటుంది.
అలాంటి వారు కింద సూచించిన విధంగా ఓ చిట్కాను పాటిస్తే ప్లేట్‌లెట్ల సంఖ్యను త్వరగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా డెంగ్యూ వ్యాధి కూడా తగ్గుముఖం పడుతుంది. ఇంతకీ ఆ మందు తయారయ్యేది బొప్పాయి ఆకులతోనే. బొప్పాయి ఆకులతో తయారు చేసిన ఓ మిశ్రమాన్ని సేవించడం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్యను బాగా పెంచుకోవచ్చు.
ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలంటే కొన్ని బొప్పాయి ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. వాటిని మిక్సీలో వేసి దాంతో పాటు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు, ఒక టీస్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపును కూడా వేయాలి. అనంతరం అన్ని పదార్థాలను బాగా మిక్సీ పట్టాలి. అప్పుడు వచ్చే ద్రవాన్ని వడబోసి, దానికి కొంత తేనె కలిపి నిత్యం రెండు పూటలా తీసుకోవాలి.
డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్‌తో పాటు ఈ మిశ్రమాన్ని కూడా తీసుకోవాలి. అప్పుడే గుణం కనిపిస్తుంది. ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పెరగడమే కాదు, త్వరగా వ్యాధి నుంచి కోలుకుంటారు కూడా.
తాజా వార్తలు
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్







