కటారా ఆహ్వానం.. వీకెండ్ లో కల్చర్, వినోదంతో సందడి..!!
- August 21, 2026
దోహా: వారాంతాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేందుకు ఖతార్‌లోని ప్రముఖ పర్యాటక, సాంస్కృతిక కేంద్రం కటారా కల్చరల్ విలేజ్ సందర్శకులను ఆహ్వానించింది. కళలు, సినిమా, ఫుడ్, ఫొటోగ్రఫీ, సముద్ర అందాలతో కూడిన విభిన్న అనుభవాలను ఆస్వాదించేందుకు అవకాశం ఉందని తెలిపింది.
కటారా విడుదల చేసిన వివరాల ప్రకారం.. వారాంతంలో సందర్శకులను ఆకట్టుకునేలా పలు కార్యక్రమాలు, ప్రదర్శనలు అందుబాటులో ఉన్నాయి. కటారా ప్రాంగణంలో ప్రశాంతంగా నడక సాగించడంతో పాటు వివిధ సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించవచ్చు.
కటారాలోని బిల్డింగ్-18లో ఉన్న ఖతార్ ఫొటోగ్రఫీ సెంటర్లో ‘లెగసీ ఆఫ్ ది వరల్డ్ కప్’ పేరుతో ఫొటో ప్రదర్శన కొనసాగుతోంది. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్-2022లోని మధుర జ్ఞాపకాలను ఫొటోల రూపంలో సందర్శకులు వీక్షించవచ్చు.
కుటుంబాలతో వచ్చే వారు, ఆహార ప్రియులు ఉషా ఫ్రష్కాలో అందించే పానీయాలను ఆస్వాదించవచ్చు. సినిమా ప్రియుల కోసం బిల్డింగ్-49లోని కటారా సినిమాలో తాజా చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. సినిమా షో టైమింగ్స్, బుకింగ్ వివరాల కోసం 31393976 నంబర్‌ను సంప్రదించవచ్చు.
కటారా అందమైన మార్గాల్లో నడక, ఆర్ట్ గ్యాలరీల సందర్శన, సముద్రాన్ని వీక్షిస్తూ భోజనం చేయడం వంటి అనుభవాలను కూడా సందర్శకులు ఆస్వాదించవచ్చని అధికారులు తెలిపారు.
ఏడాది పొడవునా కటారాలో అంతర్జాతీయ, ప్రాంతీయ, స్థానిక స్థాయిలో వివిధ ఉత్సవాలు, వర్క్‌షాప్‌లు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖతార్ వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు ప్రపంచంలోని వివిధ సంస్కృతులపై అవగాహన పెంచేలా కటారా పనిచేస్తోంది. ప్రస్తుత కార్యక్రమాలు, సదుపాయాలు, సేవల వివరాల కోసం కటారా కాల్ సెంటర్ 182ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







